AP PGCET 2024 Notification: ఏపీ పీజీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. సీబీటీ విధానంలో పరీక్ష
పీజీ కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐబీఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. చివరి సంవత్సరం పరీక్ష రాస్తున్న విద్యార్థులు అర్హులే.
ఎంపిక విధానం: రాతపరీక్ష(ఎంపీఈడీ మినహా)లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో పరీక్ష జరుగుతుంది. ప్రశ్నాపత్రం 100 మార్కులకు ఉంటుంది. లాంగ్వేజ్ స్పెషలైజేషన్ పేపర్లు మినహా మిగతా అన్ని ప్రశ్నాపత్రాలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. ఆబ్జెక్టివ్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 90 నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.05.2024.
ప్రవేశ పరీక్షలు ప్రారంభం: 10.06.2024.
వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/