NID Recruitment 2024: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: డిజైన్‌ అసిస్టెంట్‌–01, టెక్నికల్‌ అసిస్టెంట్‌–02, సీనియర్‌ అసిస్టెంట్‌–02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: డిజైన్‌ అసిస్టెంట్, టెక్నికల్‌ అసిస్టెంట్‌లకు 30 ఏళ్లు, సీనియర్‌ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: డిజైన్‌ అసిస్టెంట్, టెక్నికల్‌ అసిస్టెంట్‌లకు రూ.25,500 నుంచి రూ.81,100,సీనియర్‌ అసిస్టెంట్‌కు రూ.29,200 నుంచి రూ.92,300.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.03.2024.

చదవండి: Balmer Lawrie Recruitment 2024: బామర్‌ హైదరాబాద్‌లో జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

వెబ్‌సైట్‌: https://www.nid.edu/

#Tags