NEET AP College Wise Cutoff Ranks : మీ నీట్‌ ర్యాంక్‌కు ఎక్కడ సీటు వ‌స్తుందంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : మీరు నీట్‌-2023లో అర్హ‌త సాధించారా.. మీకు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో అని బెంగ‌ప‌డుతున్నారా..! మీకు జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్‌ వస్తుంది? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజిలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకొంటున్నారు.
NEET Rank Based Expected College and Seat

కాలేజీల ప్రాధాన్యతక్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో మెడిక‌ల్ సీట్ల స‌మ‌గ్ర వివ‌రాలు మీకోసం.. 

ఏపీలో మొత్తం సీట్లు ఇవే..

ఈ సారి ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ–2023 ఫలితాలు వెలువడ్డ విష‌యం తెల్సిందే. ఈ ఏడాది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 68,578 మంది విద్యార్థులు నీట్‌ రాయగా 42,836 మంది అర్హత సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,185 సీట్లు 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించినవి. ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కొత్తగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకానున్నాయి.

➤☛ NEET 2023 Ranker Success Story : ఓటమిని ఏనాడు ఒప్పుకోలేదు.. ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నా.. ఈ క‌సితోనే నీట్‌లో ర్యాంక్ కొట్టానిలా.. కానీ..

పెరిగిన సీట్ల వివ‌రాలు ఇవే..

వీటిలో ఒక్కో కాలేజిలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఇది విద్యార్థులకు వరమే. వీటితో కలుపుకొంటే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు 2,935కు పెరుగుతాయి. వీటిలో 15 శాతం సీట్లు ఆల్‌ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు గత ఏడాది నుంచి బీ కేటగిరిలో 85 శాతం సీట్లలో మన విద్యార్థులకే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.

➤☛ NEET UG Exam 2023 Question Paper & Key : నీట్ ప్ర‌శ్నాప‌త్రం ఇదే... ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

ఫ‌స్ట్‌ చాయిస్ ఈ కాలేజీకే..

సాధారణంగా రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి చాయిస్‌ ఆంధ్ర వైద్య కళాశాలే. ఈ కాలేజిలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కాలేజిలో గత ఏడాది (2022–23) ఎస్టీ విభాగంలో 456 స్కోర్‌తో 120176 ర్యాంక్‌ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఎస్సీ విభాగంలో 76695 ర్యాంక్, బీసీ–ఏలో 25137, బీసీ–బిలో 31874, బీసీ–సిలో 26291, బీసీ–డిలో 17632, బీసీ–ఈలో 68801, ఓసీ కేటగిరీలో 15652, ఈడబ్ల్యూఎస్‌లో 19907 ర్యాంక్‌ వారికి చివరి సీట్‌లు వచ్చాయి. దాని తర్వాతి స్థానాల్లో గుంటూరు, కర్నూలు, కాకినాడ తదితర ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి.

➤☛ NEET 2023 Top 10 Rankers : నీట్‌-2023 ఫ‌లితాల్లో ఫ‌స్ట్ ర్యాంక‌ర్ మ‌న కుర్రాడే.. టాప్ 10 ర్యాంక‌ర్స్ వీరే.. ఈ సారి మాత్రం..

గుంటూరు వైద్య కళాశాలలో ఓసీ విభాగంలో 22531, ఈడబ్ల్యూఎస్‌లో 26162, బీసీ–ఎలో 46529, బీసీ–బిలో 36192, బీసీ–సిలో 42535, బీసీ–డిలో 32830, బీసీ–ఈలో 65595, ఎస్సీలో 94801, ఎస్టీ విభాగంలో 132580 ర్యాంక్‌ వరకూ సీట్లు వచ్చాయి. కర్నూలు వైద్య కళాశాలలో ఓసీ కేటగిరీలో 20419,  బీసీ–ఎలో 46268, బీసీ–బిలో 34676, బీసీ–సిలో 32239, బీసీ–డిలో 45304, బీసీ–ఈలో 36371, ఈడబ్ల్యూఎస్‌లో 26954, ఎస్సీలో 91270, ఎస్టీ విభాగంలో 115105 ర్యాంక్‌ వరకు విద్యార్థులు సీట్లు సాధించారు. కాకినాడ రంగరాయలో ఓసీ విభాగంలో 25622, బీసీ–ఎలో 48837, బీసీ–బిలో 47893, బీసీ–సిలో 44104, బీసీ–డిలో 31589, బీసీ–ఈలో 89637, ఈడబ్ల్యూఎస్‌లో 31333,  ఎస్సీలో 97913, ఎస్టీ కేటగిరీలో 143288 ర్యాంక్‌ల వరకూ సీట్లు లభించాయి.

➤☛ NEET Ranker Success Story : పొద్దున పూట కూలీ ప‌ని చేశా.. రాత్రి పూట చదివా.. అనుకున్న‌ట్టే.. నీట్‌లో మంచి ర్యాంక్‌ కొట్టానిలా..

NEET AP MBBS Cutoff Ranks :

College Name BC_A BC_B BC_C BC_D BC_E EWS MINORITY OC SC ST
ACSR Government Medical College, Nellore 72594 68077 88189 68835 80400 42376   39942 119273 150503
Alluri Seetharama Raju Academy of Medical Sciences, Eluru 75493 78568 60889 53529 115914     41642 129052 176867
Andhra Medical College, Visakhapatnam 25137 31874 26291 17632 68801 19907   15652 76695 120176
Apollo Institute of Medical Sciences and Research, Chittoor 105731 95483 122076 92176 102095     59025 145251 198868
Dr. Pinnamaneni Siddhartha Institute of Medical Sciences, Gannavaram 85876 85883 70418 65258 127077     48451 132918 185583
Fathima Institute of Medical Sciences, Kadapa (Minority)             130603      
Gayatri Vidya Parishad Instt. of Health Care & Medical Technology, Visakhapatnam 99435 104909 95894 71379 131597     56717 150863 197158
Government Medical College, Anantapur 73908 69148 96158 71675 82064     41629 119374 156991
Government Medical College, Kadapa 81148 72353 71039 75960 87305 50631   45340 126832 163354
Government Medical College, Ongole 68218 65695 59191 45906 99442 37401   34191 111600 158636
Government Medical College,Srikakulam 64744 64551 67071 45296 112587     36492 113671 155870
Great Eastern Medical School and Hospital, Srikakulam 97439 101178 97128 70504 137403     55989 150545 193459
GSL Medical College, Rajahmundry 87683 89143 66819 58045 126826     47800 138935 190395
Guntur Medical College, Guntur 46529 36912 42535 32830 65595 26162   22531 94801 132580
Katuri Medical College and Hospital, Guntur 92878 92893 77002 65233 125780     49140 139335 176852
Konaseema Institute of Medical Sciences and Research Foundation, Amalapuram 92426 95708 80354 67366 133469     52009 142283 186166
Kurnool Medical College, Kurnool 46268 34676 32239 45304 36371 26954   20419 91270 115105
Maharaja Institute of Medical Sciences, Vizianagaram 98124 97019 89267 70563 135229     55904 149630 189819
Narayana Medical College, Nellore 94240 82784 74522 86642 94439     55038 136796 179283
Nimra Institute of Medical Sciences, Vijayawada (Minority)             184719      
NRI Institute of Medical Sciences, Visakhapatnam 97945 99704 79732 69556 133574     54401 149704 193489
NRI Medical College, Chinnakakani 71551 66405 59777 48863 103634     38163 120294 160465
P.E.S. Institute of Medical Sciences and Research, Kuppam 106160 97875 116887 93541 104527     58519 145786 185226
Rangaraya Medical College, Kakinada 48837 47893 44104 31589 89637 31333   25622 97913 143288
Santhiram Medical College, Nandyal 107305 100450 120195 98649 103935     60472 145894 190158
51710 51222 47307 35078 92870 31558   28118 98658 143315
200701 104141 126129 100372 125919 95411   89022 203197 178179
61104 54418   58434 57902 36317   34319 108408 130361
  41801     37896     24928 76812 126305
Sri Balaji Medical College Hospital and Research Institute, Renigunta, Tirupati 113245 107975 125948 107014 112333     63212 149467 198324
Sri Padmavathi Medical College for Women, Tirupati (under SVIMS) 89733 87438 110490 81373 96140 58085   52453 136410 179439
Sri Venkateswara Medical College, Tirupati 60033 49270 65234 54552 56195 32180   29226 105312 123947
Viswabharathi Medical College, Kurnool 110218 106585   104614 107031     62726 147748 192370

MBBS Colleges and Seats in Andhra Pradesh

S.No Name of Medical College Affiliated To Management Seats
1 S V Medical College, Tirupati Dr. YSRUHS Govt. 240
2 Government Medical College, Machilipatnam Dr. YSRUHS Govt. 150
3 All India Institute of Medical Sciences, Mangalagiri, Vijayawada Statutory Autonomous, AIIMS(New Delhi) Govt. 125
4 Kurnool Medical College, Kurnool Dr. YSRUHS Govt. 250
5 Andhra Medical College, Visakhapatnam Dr. YSRUHS Govt. 250
6 Guntur Medical College, Guntur Dr. YSRUHS Govt. 250
7 Maharajah Institute of Medical Sciences, Vizianagaram Dr. YSRUHS Trust 150
8 Narayana Medical College, Nellore Dr. YSRUHS Trust 250
9 NRI Medical College, Guntur Dr. YSRUHS Trust 200
10 Santhiram Medical College, Nandyal Dr. YSRUHS Trust 150
11 Dr. P.S.I. Medical College , Chinoutpalli Dr. YSRUHS Trust 150
12 Government Siddhartha Medical College, Vijaywada Dr. YSRUHS Govt. 175
13 P E S Institute Of Medical Sciences and Research, Kuppam Dr. YSRUHS Trust 150
14 Alluri Sitaram Raju Academy of Medical Sciences, Eluru Dr. YSRUHS Trust 250
15 Katuri Medical College, Guntur Dr. YSRUHS Trust 150
16 Rangaraya Medical College, Kakinada Dr. YSRUHS Govt. 250
17 GSL Medical College, Rajahmundry Dr. YSRUHS Trust 250
18 Government Medical College, Eluru Dr. YSRUHS Govt. 150
19 Government Medical College, Nandyal Dr. YSRUHS Govt. 150
20 Government Medical College, Vizianagaram Dr. YSRUHS Govt. 150
21 Sri Balaji Medical College, Hospital and Research Institute, Chittoor Dr. YSRUHS Trust 150
22 Gayathri Vidya Parishad Institute of Health Care & Medical Technology, Visakhapatnam Dr. YSRUHS Society 200
23 Apollo Institute of Medical Sciences and Research, Chittoor Dr. YSRUHS Society 150
24 Nimra Institute of Medical Sciences, Krishna Dist., A.P. Dr. YSRUHS Society 150
25 GITAM Institute of Medical Sciences and Research, Visakhapatnam Gandhi Institute of Technology and Management (GITAM University) Deemed, Visakhapatnam Private 150
26 SVIMS - Sri Padmavathi Medical College for Women, Alipiri Road, Tirupati Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS), Tirupati Govt. 175
27 ACSR Government Medical College Nellore Dr. YSRUHS Govt. 175
28 Viswabharathi Medical College, Kurnool Dr. YSRUHS Society 150
29 NRI Institute of Medical Sciences, Visakhapatnam Dr. YSRUHS Trust 150
30 Government Medical College, Ongole (Previously known as Rajiv Gandhi Institute of Medical Sciences, Ongole,) Dr. YSRUHS Govt. 120
31 Fathima Instt. of Medical Sciences,Kadapa Dr. YSRUHS Trust 100
32 Great Eastern Medical School and Hospital,Srikakulam Dr. YSRUHS Trust 150
33 Rajiv Gandhi Institute of Medical Sciences, Srikakulam Dr. YSRUHS Govt. 150
34 Government Medical College, Kadapa Dr. YSRUHS Govt. 175
35 Konaseema Institute of Medical Sciences & Research Foundation, Amalapuram Kaloji Narayana Rao University of Health Sciences, Warangal Trust 150
36 Government Medical College, Ananthapuram Dr. YSRUHS Govt. 150

#Tags