NITVAR Posts : ఎన్ఐటీవీఏఆర్‌లో వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..
పుణెలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ (ఎన్‌ఐటీవీఏఆర్) అప్పర్ డివిజన్ క్లర్క(యూడీసీ), లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 08.
» పోస్టుల వివరాలు: యూడీసీ–03, ఎల్‌డీసీ–05.
» అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 18 నుంచి 27 ఏళ్లు మించకూడదు.
» వేతనం: నెలకు యూడీసీ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100, ఎల్‌డీసీ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200.
» ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» దరఖాస్తులకు చివరితేది: 19.09.2024.
» వెబ్‌సైట్: https://main.ic-mr.nic.in
THM Non Medical Posts : టీఎంహెచ్‌లో నాన్-మెడికల్ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు..
#Tags