Germany Job Offers : బీఎస్సీ నర్సింగ్ నిరుద్యోగులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు..
అనంతపురం: జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ(జీఎన్‌ఎం), బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీవీ ప్రతాప్ రెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జర్మన్ లాంగ్వేజ్‌పై శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.75 వేలు కాషన్ డిపాజిట్ చెల్లించడంతోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Paramedical courses Admissions: పారామెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
రెసిడెన్షియల్ శిక్షణతోపాటు ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులకు వీసా ఫీజు, రానుపోను విమాన టిక్కెట్లు చెల్లిస్తామని తెలిపారు. జర్మనీలో సుమారు రూ.2,33 లక్షల నుంచి 3,26,000(2400 యూరోల నుంచి 3500 యూరోల వరకు) వరకు వేతనం చెల్లిస్తారని పేర్కొన్నారు. వివరాలకు 99888 53335 నంబరులో సంప్రదించాలని సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)