Civil Assistant Surgeon : టీవీవీపీలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టులు

హైదరాబాద్‌లోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) ఒప్పంద ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు టీవీవీపీ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 64.
»    వేతనం: నెలకు రూ.1,00,000.
»    విభాగాల వారీగా ఖాళీలు: ఓబీ/జీవై–17, అనెస్తీషియా–11, పీడియాట్రిక్స్‌–12, రేడియాలజీ–08, జనరల్‌ మెడిసిన్‌–10, ఆర్థోపెడిక్స్‌–02, జనరల్‌ సర్జరీ–04.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ/డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    వయసు: 46 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌(హెచ్‌ఎస్‌–ఐ), ఫోర్త్‌ ఫ్లోర్, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్, ఖైరతాబాద్, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 26.11.2024.
»    వెబ్‌సైట్‌: https://hyderabad.telangana.gov.in

Apprentice Training : బీడీఎల్‌లో అప్రెంటీస్ శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే!

#Tags