AIIMS Recruitment: ఎయిమ్స్‌ డియోఘర్‌లో 107 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

డియోఘర్‌(జార్ఖండ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 107.
వేతనం: నెలకు రూ.67,700.
విభాగాలు: అనెస్తీషియాలజీ అండ్‌ క్రిటికల్‌ కేర్, అనాటమీ, బయో కెమిస్ట్రీ, డెర్మటాలజీ, కార్డియాలజీ, డెంటల్‌ సర్జరీ, మైక్రో బయాలజీ, న్యూరాలజీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, మైక్రోబయాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌  ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌ ఆఫీస్, నాలుగో ఫ్లోర్, ఎయిమ్స్, దేవిపూర్‌(అకడమిక్‌ బ్లాక్‌), డియోఘర్‌–814152(జార్ఖండ్‌) చిరునామకు స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: నోటిఫికేషన్‌ వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్‌ వెలువడిన తేది: 26.12.2024.
వెబ్‌సైట్‌: https://www.aiimsdeoghar.edu.in

>> 1289 Jobs: ఏపీ డీఎంఈలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.97,750 జీతం..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags