CMAT 2024 Notification: సీమ్యాట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల.. మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(సీమ్యాట్‌)–2024 నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు  దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌(సీబీటీ). ప్రశ్నాపత్రం 400 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ కాంప్రెన్షన్, జనరల్‌ అవేర్‌నెస్, ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. నెగిటివ్‌ మార్కులు ఉంటాయి. ప్రతి సమాధానానికి ఒక్కో మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నాపత్రం ఆంగ్లమాధ్యమంలో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.04.2024
దరఖాస్తు సవరణ తేదీలు: 19.04.2024 నుంచి 21.04.2024 వరకు
పరీక్ష తేది: మే, 2024

వెబ్‌సైట్‌: https://cmat.nta.nic.in/

చదవండి: IIITDM Admission 2024: ఐఐఐటీడీఎంలో ఎండీఈఎస్‌లో ప్రవేశాలు.. సీఈఈడీ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

#Tags