JIPMAT 2024 Notification: NTA-JIPMAT 2024 నోటిఫికేషన్ విడుదల.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(జిప్‌మ్యాట్)–2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐఎం బో«ద్‌గయ, ఐఐఎం జమ్మూ సంయుక్తంగా అందిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం)లో ప్రవేశాలు కల్పిస్తుంది.
కోర్సు వ్యవధి: ఐదేళ్లు.
బోధనాంశాలు: లాంగ్వేజ్ స్కిల్స్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్, ఎథికల్ అండర్ స్టాండింగ్ తదితరాలు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/పన్నెండో తరగతి/10+2(ఆర్ట్స్/కామర్స్/సైన్స్ గ్రూప్) ఉత్తీర్ణులై ఉండాలి. 2022, 2023 సంవత్సరాల్లో లేదా 2024 చివరి సంవత్సరంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ).
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులకు చివరితేది: 21.04.2024.
పరీక్ష తేది: 06.06.2024.
వెబ్‌సైట్: http://www.jipmat.ac.in/
చదవండి: APRJC CET 2024 Notification: APRJC CET(మైనార్టీ)–2024 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం ఇలా..
Published date : 02 Apr 2024 05:46PM