Skip to main content

APRJC CET 2024 Notification: APRJC CET(మైనార్టీ)–2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (ఏపీఆర్‌ఈఐఎస్‌) 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు మైనారిటీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఏపీఆర్‌జేసీ (మైనారిటీ)సెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.
Intermediate First Year Admissions 2024-25  Admissions Open for APRJC Minority Gurukula Junior Colleges  APRJC CET 2024 Notification and Application Form and exam pattern and Important Dates

మొత్తం సీట్లు: 345 (గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ)
అర్హత: 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రమే చదివి ఉండాలి.

ఎంపిక విధానం: మైనారిటీ విద్యార్థులకు పదో తరగతి మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎస్సీ, ఎïస్టీ విద్యార్థులకు  ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. రిజర్వేషన్, స్పెషల్‌ కేటగిరీ, స్థానికత ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మొదటి లిస్ట్‌ అడ్మిషన్‌లు పూర్తి అయ్యాక, సెకండ్‌ లిస్ట్‌ అడ్మిషన్‌ల లిస్ట్‌ తయారుచేస్తారు.

చదవండి: Admissions in IIFT: ఐఐఎఫ్‌టీలో ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 150 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్‌ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్షసమయం 2.30 గంటలు, ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ/ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. పదోతరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు
ఫస్ట్‌లిస్ట్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.05.2024
ఫస్ట్‌లిస్ట్‌ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024
ఫస్ట్‌ సెలక్షన్‌  లిస్ట్‌ తేది: 21.05.2024.
సెకండ్‌ లిస్ట్‌ దరఖాస్తు ప్రారంభతేది: 22.05.2024.
సెకండ్‌ లిస్ట్‌ దరఖాస్తులకు చివరితేది: 30.05.2024.
సెకండ్‌ సెలక్షన్‌ లిస్ట్‌ తేది: 31.05.2024.
థర్డ్‌ లిస్ట్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.06.2024.
థర్డ్‌ లిస్ట్‌ దరఖాస్తులకు చివరితేది: 10.06.2024
థర్ట్‌ సెలక్షన్‌ లిస్ట్‌: 11.06.2024.
ప్రవేశాల ముగింపు తేది: 18.06.2024.

వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in/

Published date : 02 Apr 2024 05:40PM

Photo Stories