Management Courses Admissions : మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు క్యాట్-2024 నోటిఫికేషన్.. ఈ కళాశాలలోనే..
» దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలు: అహ్మదాబాద్, అమృత్‌సర్, బెంగళూరు, బో«ద్‌గయా, కోల్‌కతా, ఇండోర్, జమ్మూ, కాశీపూర్, కోజికోడ్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, రోహ్‌తక్, సంబల్‌పూర్, షిల్లాంగ్, సిర్మౌర్,
తిరుచిరాపల్లి, ఉదయపూర్, విశాఖపట్నం.
» అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజర య్యే అభ్యర్థులు అర్హులే.
» ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, గుంటూరు,
కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 170 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
» పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి.
» ఎంపిక విధానం: పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: 01.08.2024.
» ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 13.09.2024.
» అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలు: 05.11.2024 నుంచి 24.11.2024.
» క్యాట్ పరీక్ష తేది: 24.11.2024.
» ఫలితాల ప్రకటన తేది: 2025 జనవరి రెండో వారం.
» వెబ్‌సైట్: https://www.iimcat.ac.in
School Students : విద్యార్థుల డేటాను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.. విద్యాశాఖ కీలక ఆదేశం..
Tags
- IIM Admissions
- Management courses
- CAT 2024 Notification
- online applications
- Indian Institute of Management Admissions
- graduated students
- post graduation courses
- Common Entrance Test 2024
- entrance exam for iim admissions
- PG courses Admissions
- management courses at iim
- Education News
- Sakshi Education News
- Indian Institute of Management CAT 2024
- Common Admission Test 2024
- IIM CAT 2024 Notification