Posts at Medical College: పొరుగు సేవలకు ఉద్యోగుల తాత్కాలిక జాబితా విడుదల..

వైద్య కళాశాలలో ఉన్న ఉద్యోగ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థుల తాత్కాలిక జాబితాను విడుదల చేసినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వారు మరిన్ని వివరాలను వెల్లడించారు..

పాడేరు: స్థానిక వైద్య కళాశాలలో పొరుగు సేవల విధానంలో భర్తీ చేయనున్న 19 కేటగిరిల్లోని పోస్టులకు సంబంధించి అభ్యర్థుల తాత్కాలిక జాబితాను విడుదల చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.హేమలతాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 34 కేటగిరిల్లో 256 పారామెడికల్‌, మినీస్టిరియల్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించామన్నారు. పలు కేటగిరిల ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే రెండు విడతలుగా అభ్యర్థుల తాత్కాలిక మెరిట్‌ జాబితాలను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించామన్నారు.

TET Exam Begins: నేటి నుంచి 9 కేంద్రాల్లో టెట్‌ పరీక్షల నిర్వాహణ..

అయితే, పెండింగ్‌లో ఉన్న మరో 19 కేటగిరీలకు సంబంధించి అభ్యర్థుల తాత్కాలిక జాబితాను విడుదల చేశామని ఆమె పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. అభ్యర్థుల తాత్కాలిక మెరిట్‌ జాబితాను asrnic వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ఆమె తెలిపారు. అభ్యర్థులు పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా మెయిల్‌ ద్వారా గాని, నేరుగా గాని తెలియజేయవచ్చని ఆమె సూచించారు. recruitment gmcpaderu@gmail.comకు అభ్యంతరాలను మెయిల్‌ ద్వారా పంపించవచ్చని ఆమె తెలిపారు.

#Tags