Staff Nurses Posts: వెబ్‌సైట్‌లో స్టాఫ్ న‌ర్సుల‌ ప్రొవిజిన‌ల్ జాబితా..

స్టాఫ్ న‌ర్సుల పోస్టుల‌కు వారి స్రొవిజిన‌ల్ జాబితాను వైద్య ఆరోగ్య‌శాఖ రీజిన‌ల్ డైరెక్ట‌ర్ వెబ్‌సైట్‌లో విడుద‌ల చేశారు. అనంత‌రం, అభ్య‌ర్థుల‌కు పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన వివ‌రాల‌ను వివ‌రించారు..
Staff nurses posts applications

సాక్షి ఎడ్యుకేష‌న్: స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థుల ప్రొవిజినల్‌ జాబితా వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ఉమా సుందరి విడుదల చేశారు. సోమవారం సాయంత్రం జాబితాను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి పంపగా వారు http@//cfw.ap.nic.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. జాబితాపై అభ్యంతరాలుంటే మూడు రోజుల్లోగా తెలియజేయాలన్నారు. త్వరలో ఫైనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేస్తామన్నారు.

➤   Department of School Education: సర్కారు బడుల్లో సిలబస్‌ తంటాలు

పోస్టుల వివరాలు

మొత్తం ఆరు జిల్లాల్లో 86 పోస్టులకు వైద్య ఆరోగ్య శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ (ఆర్‌డీ) దరఖాస్తులు స్వీకరించారు. శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో మొత్తం 10,659 దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఆరోగ్యశాఖ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఉమా సుందరి ఆధ్వర్యంలో సిబ్బంది పరిశీలించారు. 86 పోస్టులకు గానూ మొత్తం 7,765 పోటీ పడుతున్నారు.

➤   Collector Transfer: క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్‌గా శ‌ర‌యు..

విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీలో 80 మంది స్టాఫ్‌ నర్సులు, వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఆరు పోస్టులు భర్తీ చేయనున్నారు. స్టాఫ్‌ నర్సుల పోస్టులను మెరిట్‌, రోస్టర్‌ విధానంలో భర్తీ చేయనున్నారు.

#Tags