Campus Recruitment: ప్ర‌భుత్వ ఐటీఐ క‌ళాశాల‌లో క్యాంప‌స్ రిక్రూట్మెంట్‌.. ఎప్పుడు?

27వ తేదీన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ను ప్రభుత్వ ఐటీఐ క‌ళాశాల‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్రిన్సిపల్‌ వి.శ్రీలక్ష్మి తెలిపారు.

తిరుపతి: తిరుపతిలోని పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 27వ తేదీన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ వి.శ్రీలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌, టెక్‌ మహీంద్రా సంస్థ ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చేపడతారని వెల్లడించారు.

TS EAMCET Counselling 2024: జూన్‌ 27 నుంచి ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

ఐటీఐ (కోపా) పాసైన వారు, ఇంటర్‌ పాస్‌/ఫెయిలైన వారు రిక్రూట్‌మెంట్‌కు హాజరయ్యేందుకు రావచ్చన్నారు. ఆసక్తి గల వారు బయోడేటా, ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఆధార్‌, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాలకు 96764 86678, 85000 21856 నంబర్లలలో ట్రైనింగ్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ను సంప్రదించాలని కోరారు.

Polytechnic Courses: పాలిటెక్నిక్ కోర్సుల‌తో ఉపాధి అవ‌కాశాలు..

#Tags