TTD Recruitment: టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎంపికైతే భారీగా వేతనాలు.. ఎంతంటే..?

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ఓరియంటల్ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు, టీటీడీ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 

పోస్టుల వివరాలు..

1.డిగ్రీ లెక్చరర్: 49 పోస్టులు
2.జూనియర్ లెక్చరర్: 29 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 78.

డిగ్రీ లెక్చరర్ పోస్టులు..
బోటనీ-3, కెమిస్ట్రీ-2, కామర్స్-9, డెయిరీ సైన్స్-1, ఎలక్ట్రానిక్స్-1, ఇంగ్లిష్-8, హిందీ-2, హిస్టరీ-1, హోమ్ సైన్స్-4, ఫిజికల్ ఎడ్యుకేషన్-2, ఫిజిక్స్-2, పాపులేషన్ స్టడీస్-1, సంస్కృతం-1, సంస్కృత వ్యాకరణం-1, స్టాటిస్టిక్స్-4, తెలుగు-3, జువాలజీ-4.

అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్/ స్లెట్ అర్హత సాధించి ఉండాలి.

జూనియర్ లెక్చరర్ పోస్టులు..
బోటనీ- 4, కెమిస్ట్రీ- 4, సివిక్స్- 4, కామర్స్- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1, హిస్టరీ- 4, మ్యాథమెటిక్స్- 2, ఫిజిక్స్- 2, తెలుగు- 3, జువాలజీ- 2.

అర్హత: కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి

వయసు: 01-07-2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది. 

వేతనం: నెలకు డిగ్రీ లెక్చరర్‌కు రూ.61,960 నుంచి రూ.1,51,370. జూనియర్ లెక్చరర్‌కు రూ.57,100 నుంచి రూ.1,47,760. 

ఎంపిక విధానం: రాత పరీక్ష(కంప్యూటర్ ఆధారిత పరీక్ష), సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తు ప్రారంభం: 2024, ఫిబ్రవరి మొదటి వారం.

వెబ్‌సైట్‌: https://www.tirumala.org/

TTD Tirupati Jobs 2023: టీటీడీ తిరుపతిలో ఏఈఈ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

#Tags