Gurukul School Jobs: గురుకులాల్లో అధ్యాపకులు, పీజీటీల నియామకాలు

గద్వాల న్యూటౌన్‌: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో అధ్యాపకులు, పీజీటీల ఖాళీలను తాత్కాలిక పద్ధతిన భర్తీ చేయనున్నట్లు సమన్వయ అధికారి రఘు ఒక ప్రకటనలో తెలిపారు. అయిజ బాలుర కళాశాలలో జంతుశాస్త్రం, గట్టు బాలికల కళాశాలలో రసాయన శాస్త్రం, ఇటిక్యాలలో పీజీటీ సాంఘికశాస్త్రం, మానవపాడు జూనియర్‌ కళాశాలలో పీజీటీ హిందీ ఖాళీలున్నాయని.. అర్హులైన అభ్యర్థులకు డెమోలు నిర్వహించి మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ధ్రువపత్రాలతో బుధవారం సాయంత్రం 4 గంటలలోపు సెల్‌నంబర్‌ 79950 10612 సంప్రదించాలని సూచించారు.
 

Govt Jobs: జూనియర్‌ కాలేజీల్లో 73 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ..

#Tags