Teacher Jobs: గెస్ట్‌ టీచర్‌గా పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అతిథి ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించేందుకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కో ఆర్డినేటర్‌ పద్మజ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దరఖాస్తు చేసుకునే వారికి బీఈడీతో పాటు టెట్‌ అర్హత పొంది ఉండాలన్నారు.

BSc Nursing Course: ఆర్మీలో నర్సింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. వీళ్లు మాత్రమే అర్హులు

పీజీలో సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులు, బీఈడీలో సంబంధిత సబ్జెక్టులో మెథడాలజీ చదివి ఉండాలని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 5వ తేదీలోపు స్వయంగా జిల్లా కేంద్రంలోని ఎంప్లాయిమెంట్‌ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న జిల్లా డీసీఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు.
 

#Tags