RITES Recruitments : సర్కార్ కొలువుకు రైట్స్ నోటిఫికేషన్.. ఎంపిక విధానం ఇలా..!
సాక్షి ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్.. దీనిని సద్వినియోగం చేసుకోండి. తాజాగా, రైట్స్ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ సంస్థలో ఇంజనీర్ ప్రొఫెషనల్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
దీనిలో భాగంగా, అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) 9 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (ఎస్అండ్‌టీ) 4 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 2 పోస్టులు ఉండగా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇది మంచి అవకాశం. రైట్స్.. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ ప్రకటించి రిక్రూట్‌మెంట్‌లో దరఖాస్తులు చేసుకోవాలంటే ఈ వివరాలను పరిశీలించండి..
అర్హులు: బీఈ, బీటెక్, డిప్లొమా చేసిన విద్యార్థులు.
వయోపరిమితి: 40 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు.
Guest Teacher Posts : ఈ పాఠశాలలో గెస్ట్ టీచర్ పోస్టులు.. ఈ తేదీలోగా..!
దరఖాస్తు రుసుం: జనరల్ కేటగిరీకి రూ. 600, SC, ST, EWS, PWD కేటగిరీ అభ్యర్థులకు రూ. 300గా నిర్ణయించారు.
ఎంపిక విధానం: 13 జనవరి 2025న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేసి,
19 జనవరి 2025న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 9వ తేదీ 2025
అధికారిక వెబ్‌సైట్: rites.com
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)