Mega Job Mela: రేపు మెగా జాబ్‌ మేళా.. ఎక్క‌డంటే..

పార్వతీపురం మన్యం జిల్లా: చీపురుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న గురువారం మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.పీవీ కృష్ణాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్‌ మేళాకు 14 బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఈ జాబ్‌ మేళాకు టెన్త్‌, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, బీటెక్‌, పీజీ, డిప్లమో, ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన యువతీ, యువకులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌ఏపీఎస్‌ఎస్‌డీసీడాట్‌ఇన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 29న ఉదయం 9 గంటలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని ఆ సమయానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆధార్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఫోన్‌ 9010023033, 7286042743 నంబర్లను సంప్రదించాలని వివరించారు.
 

చదవండి: Bank Jobs 2024: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3000 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

#Tags