Job Mela: ఈనెల 31న జాబ్‌మేళా.. నెలకు రూ.16వేలకు పైగానే జీతం

నెల్లూరు సిటీ: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జూలై 31న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి ఎం.వినయ్‌ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెజాన్‌ కంపెనీ వారు చైన్నె, హైదరాబాద్‌లో పని చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Degree Lecturer : డిగ్రీ కళాశాలలో అధ్యాపకునికి అరుదైన గౌర‌వం..

ఎస్సెస్సీ, ఇంటర్‌, ఏదైనా డిగ్రీ చదివి, 18 సంవత్సరాల వయస్సు దాటిన వారు అర్హులని తెలిపారు. వీరికి జీతంగా రూ.16,780 ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31న స్థానిక ఆటోనగర్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఉదయం 10.30కు జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.
 

#Tags