JOB Mela: 1270 ఖాళీలు.. రేపు జాబ్‌మేళా, ఆ అభ్యర్థులు అర్హులు

జెడ్పీసెంటర్‌(మహబూనగర్‌): జిల్లా ఎంప్లాయిమెంట్‌ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈనెల 15వ తేదీన పిల్లలమర్రి రోడ్డులోని ఎంప్లాయింట్‌ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు అధికారి మహమ్మద్‌ జానీ పాషా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పలు కంపెనీలకు చెందిన 1,270 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

అభ్యర్థులు ఎస్‌ఎస్‌ఎస్సీ, ఇంటర్‌, డిగ్రీ, డిప్లామా, బీటెక్‌ అర్హత ఉన్న అభ్యర్థులు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉండాలని, మేళాకు సర్టిఫికెట్లతో పాటు ఆధార్‌కార్డు, బయోడేటాతో హాజరు కావాలని కోరారు. ఇతర వివరాల కోసం 95502 05227, 99485 68830, 96668 22717 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Lecturer posts: లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం
ఉమ్మడి జిల్లాలోని మినీ గురుకులాల్లో 1నుంచి 5 తరగతుల్లో రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీఓ నాగార్జునరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. జడ్చర్ల, గండీడ్‌, బిజినేపల్లి, లింగాల, అమ్రాబాద్‌ మినీ గురుకులాల్లో 235 సీట్లు ఖాళీగా ఉన్నాయని, స్థానికులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

#Tags