Job Interviews: వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఆ సర్టిఫికేట్స్ తప్పనిసరి!
చిత్తూరు : మహిళా, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) పరిధిలోని వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు ఈ నెల 28, 29 మరియు 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా పీడీ నాగశైలజ తెలిపారు.జిల్లా ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, అసిస్టెంట్, బ్లాక్ కో-ఆర్డినేటర్, ప్రొటెక్షన్ ఆఫీసర్, కౌన్సిలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్ వంటి పలు పోస్టులను ఈ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 23న నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లతో సహా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
పోషణ్ అభియాన్: జిల్లా ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, అసిస్టెంట్, బ్లాక్ కో-ఆర్డినేటర్ పోస్టులకు సంబంధించిన ఇంటర్వ్యూలు 28న జరుగుతాయి.
మిషన్ వాత్సల్య: ప్రొటెక్షన్ ఆఫీసర్, కౌన్సిలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్ వంటి పోస్టులకు 29న ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
BECIL Recruitment 2024: టెన్త్/ డిప్లొమా అర్హతతో ఉద్యోగం.. నెలకు రూ. 30వేలు
మిషన్ శక్తి: ఐటీ, ఆఫీస్ అసిస్టెంట్, సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వంటి పోస్టులకు 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
అభ్యర్థులు నిర్దేశించిన తేదీల్లో కలెక్టరేట్‌కు హాజరు కావాలని జిల్లా పీడీ తెలిపారు.