Contract Jobs: కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం(ప్రకాశం చౌక్) : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి సుజాతరాణి తెలిపారు. సాక్ష్యం అంగన్‌వాడీ పోషణలో బ్లాక్ కో–ఆర్డినేటర్ పోస్టులు 3 ఉన్నాయని, ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అలాగే వన్‌స్టాప్ సెంటర్‌లో కేస్ వర్కర్–1, సెక్యూరిటీ గార్డు–2 పోస్టులు, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో పార్ట్‌టైమ్ డాక్టర్–1, ఆయాలు–3 పోస్టులకు వచ్చేనెల 2లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్ 9247273301 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
#Tags