JEE Main 2025 New Guidelines: జేఈఈ మెయిన్స్ దరఖాస్తుకు.. ఈ ధృవపత్రాల్లోని పేరే ప్రామాణికం..
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డు, పదోతరగతి ధృవపత్రాల్లోని పేర్లు వేర్వేరుగా ఉంటే ఆధార్‌లోని పేరునే ప్రామాణికంగా తీసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సూచించింది.
దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపేటప్పుడు ఆధార్, టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లలోని పేర్లు సరిపోవడం లేదనే మెసేజ్ వస్తోందని పలువురు అభ్యర్థులు ఎన్‌టీఏకి ఫిర్యాదు చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఆధార్‌పై ఉన్న పేరును దరఖాస్తులో నింపాలని, టెన్త్ ధృవపత్రాలను అప్‌లోడ్ చేస్తే సరిపోతుందని ఎన్‌టీఏ వివరణ ఇచ్చింది.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
‘ఆధార్‌లోని పేరు సరిపోలడం లేదు.. దగ్గర్లోని ఆధార్ సెంటర్‌ను సంప్రదించండి’ అనే మెసేజ్ వస్తే దాన్ని క్లోజ్ చేయాలని, అప్పుడు వేరే విండో వస్తుందని.. దాని ద్వారా ముందుకు వెళ్లొచ్చని తెలిపింది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags