JEE Main 2024: జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పొడిగించింది.

నవంబర్‌ 30తో గడువు ముగియగా డిసెంబర్‌ 4వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది. డిసెంబర్‌ 6 నుంచి 8 వరకు సవరణలు చేసు­కోవచ్చు. ఏప్రిల్‌ సెషన్‌ పరీక్షకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి  ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు  ప్రారంభమవుతాయని సమాచారం.  

చదవండి: JEE Mains 2024: లాజిక్‌ పసిగట్టు.. జేఈఈ ర్యాంక్‌ కొట్టు!

JEE Success Tips : జేఈఈ మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌ రాసే విద్యార్థుల‌కు నా స‌ల‌హా ఇదే..

అనుకున్న ల‌క్ష్యం సాధించాలనే తపన ఉంటే అసాధ్యమనేది ఉండదని అంటోంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్ 56వ‌ నాగ భవ్యశ్రీ.

ఈ నేప‌థ్యం భవ్యశ్రీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎలా ప్రిపేర‌య్యారు..? ఎలాంటి బుక్స్ చ‌దివారు..? ఈమె స‌క్సెస్ సిక్రెట్ ఎంటి మొద‌లైన అంశాలు కింది స్టోరీలో చ‌ద‌వండి.  

కుటుంబ నేప‌థ్యం :
మాది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరు ప‌ట్ట‌ణం. నాన్న గారు నయకంటి నాగేంద్రకుమార్‌ అమ్మ ఇంద్రలత. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప‌నిచేస్తున్నారు . చెల్లి పదో తరగతి చదువుతుంది.

ఎడ్యుకేష‌న్ :
నేను 8వ తరగతి నుంచే జేఈఈకి ప్రిపేర్‌ కావాలని ఉండేది. అప్పటి నుంచే చదువుతున్నా. అమ్మానాన్నలు నన్ను గైడ్‌ చేస్తుంటారు. జేఈఈ వైపు రావడం నా సొంత నిర్ణయమే. ఇంటర్‌ హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో పూర్తి చేశాను.

నా జేఈఈ ప్రిప‌రేష‌న్ ఇలా..

మా టీచర్లు ఇచ్చిన బెస్ట్ స్ట‌డీ మెటీరియల్‌తో పాటు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివాను. అలాగే రోజు 12-13 గంటలు పుస్తకాలతో గడిపేదాన్ని. ఒక్కో సబ్జెక్టుకు కనీసం 4 గంటలు స‌మ‌యం కేటాయించా. టాపిక్‌ను బట్టి ఎంత సమయం వెచ్చించాలనేది నిర్ణయించుకునేదాన్ని. నాకు మ్యాథ్స్‌ సబ్జెక్టు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్‌. ఆర్గానిక్‌ కెమిస్ట్రీకి పీటర్‌ సైట్‌, ఫిజిక్స్‌కు యూనివర్సిటీ ఆఫ్‌ ఫిజిక్స్‌ బుక్స్‌ చదివా. ఆదివారాల్లో రిలాక్స్‌ కోసం మాత్రమే సోషల్‌ మీడియాలో కామెడీ వీడియోలు చూశాను. జేఈఈ మెయిన్స్‌కు, అడ్వాన్స్‌డ్‌కు కంబైన్డ్‌గానే చదివాను. బోర్డ్‌ పరీక్షలకు ముందే వీటికి సంబంధించి కంటెంట్‌పై ఫోకస్‌ పెట్టాలి. జనవరి తర్వాత నుంచి బోర్డ్‌ పరీక్షలకు సమయం కేటాయించాలి. పేద అనే తేడా లేకుండా శ్రద్ధ ఉంటే ఎవరైనా ర్యాంకు దక్కించుకోవచ్చు. 

నెగెటివ్‌ మార్కింగ్‌లో..
నెగెటివ్‌ మార్కింగ్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాను. ముందు ప్రశ్నలు బాగా అర్థం చేసుకున్నాకే సమాధానం ఎంచుకున్నాను. తెలిసినట్టు అనిపించినా తప్పు సమాధానం ఇస్తే ర్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే సులభంగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాశాను. తర్వాత కఠిన స్థాయి ప్రశ్నలపై దృష్టి పెట్టాను. గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేశాను.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే వారికి నా స‌ల‌హా..
ముందు మ‌నపై మనకు నమ్మకం ఉండాలి. దానికి తోడు హార్డ్‌వర్క్‌, ఓపిక చాలా అవసరం. ఎగ్జామ్‌ టెంపర్‌మెంట్‌, స్ట్రాటజీని డెవలప్‌ చేసుకోవాలి. పోటీ ప్రపంచంలో సబ్జెక్టుపై పట్టు ఉంటేనే ర్యాంకు వస్తుంది. అలా అని విరామం లేకుండా చదివితే ప్రయోజనం ఉండదు.

#Tags