JEE Advanced 2024: ‘అడ్వాన్స్‌డ్‌’ ఈసారి పర్లేదు.. ఇన్ని మార్కులకుపైగా సాధిస్తే 5 వేల ర్యాంకు వరకు వచ్చే వీలుందని నిపుణుల సలహా

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశానికి మే 26న‌ జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సుమా­రు 2 లక్షల మంది హాజరయ్యారు.

తెలుగు రాష్ట్రా­ల నుంచి సుమారు 50 వేల మంది పరీక్ష రాశారు. ఐఐటీ మద్రాస్‌ నిర్వహించిన పరీక్ష ఈసారి కాస్త తేలికగానే ఉందని పలువురు విద్యార్థులు తెలిపారు. పేపర్‌–1 మధ్యస్థం నుంచి కొంత కష్టంగానే ఉందని మేథ్స్‌ నిపుణులు ఎంఎన్‌ రావు తెలిపారు. కానీ పేపర్‌–2 మధ్యస్థంగానే ఉన్నట్లు విశ్లేషించారు.

కెమెస్ట్రీలో కొన్ని ప్రశ్నలు తేలికగా మరికొన్ని మధ్యస్థంగా ఉన్నాయని చెప్పారు. ఫిజిక్స్‌ రెండు పేపర్లు కాస్త సులువుగానే ఉన్నట్లు వివరించారు.

>> TS EAPCET Cutoff Ranks - 1st phase | 2nd | Final | Spl

అడ్వాన్స్‌డ్‌ పేపర్‌లో ఇచ్చిన ప్రశ్నలు, ప్రశ్నపత్రం తీరును పరిశీలిస్తే మొత్తం 360 మార్కులకుగాను 200 మార్కులకుపైగా సాధిస్తే 5 వేల ర్యాంకు వరకు వచ్చే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

>> Top 20 Engineering (Branch wise) Colleges in Telangana - Click Here

150 నుంచి 200 మధ్య మార్కులొస్తే 5 వేల నుంచి 9 వేల మధ్య ర్యాంకు రావొచ్చని చె­బు­తున్నారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులు మొత్తంగా 70 మార్కులు సంపాదిస్తే (ప్రతి సబ్జెక్టులో 6% తప్పనిసరి) అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించే వీ­లుం­ది.

>> College Predictor - 2024 (AP&TG - EAPCET, POLYCET and ICET) - Click Here

ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో 5% మార్కులు తెచ్చుకొని మొత్తంగా 60 మార్కులు సాధిస్తే అర్హత పొందుతారు. ఎస్సీ, ఎస్టీ వి­­ద్యార్థులు ప్రతి సబ్జెక్టులో 3 శాతంతోపాటు 30 మార్కులు తెచ్చుకుంటే అర్హత పొందే వీలుంది.   

#Tags