JEE Advanced Ranks: జూన్ మొదటి వారంలో జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులు.. ‘కీ’ విడుదల తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టా త్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్, బీఆర్క్‌లో ప్రవేశా నికి సంబంధించి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ అడ్వాన్స్‌డ్) ర్యాంకులు జూన్ 4న వెలువడే అవకాశం ఉంది.
పరీక్షలు మే 26న దేశవ్యాప్తంగా జరిగాయి. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన 2.5 లక్షల మందిని ఈ పరీక్షకు ఎంపిక చేశారు. వీరిలో 2 లక్షల మంది వరకు అడ్వాన్స్‌డ్ రాశారు. ఇందుకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ మే 31 వరకు వెలువడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
చదవండి: Engineering Counselling: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?.. కారణం ఇదే..
జూన్ 2న ప్రొవిజినల్ ఆన్సర్ ‘కీ’ విడుదల చేస్తారు. 3వ తేదీ సాయంత్రానికి అభ్యంతరాలు స్వీకరిస్తారు. 4వ తేదీ లేదా 5న ర్యాంకులు ప్రకటిస్తారు. అడ్వాన్స్‌డ్ ర్యాంకుల తర్వాత జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
Published date : 28 May 2024 12:50PM