JEE Advanced: టాపర్లంతా ఈ ఐఐటీ వైపే.. ఏ ఐఐటీలో ఎంత మంది?

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఎక్కువ మంది టాపర్లు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌కే ప్రాధాన్యతనిచ్చారు.
టాపర్లంతా ఈ ఐఐటీ వైపే.. ఏ ఐఐటీలో ఎంత మంది?

తాజాగా వెల్లడించిన తొలి దశ సీట్ల కేటాయింపులో ఈ విషయం స్పష్టమైంది. ఐఐటీల్లో ఎక్కువ మంది టాపర్లు ముంబై ఐఐటీకే మొదటి ప్రాధాన్యతనిచ్చి ఎక్కువ మంది అక్క­డే సీట్లు పొందారు. ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండటంతో 66వ ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. అడ్వాన్స్‌డ్‌లో టాప్‌ వందలో ర్యాంకులు పొందిన 89 మంది తొలి ప్రాధాన్యతగా ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ను ఎంచుకున్నారు. వీరిలో మెరిట్‌ ప్రకారం 67 మందికి సీట్లు వచ్చాయి. గత ఏడాది టాప్‌ 100లో 93 మంది ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుకు ఆప్షన్‌ ఇచ్చారు.

చదవండి: IIT Bombayకు రూ.315 కోట్ల విరాళం.. ఆయన ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం విరాళం ఇంత!!

టాపర్స్‌ ఏ ఐఐటీలో ఎంత మంది ఆప్షన్లు ఇచ్చారు?

ఐఐటీ

విద్యార్థుల సంఖ్య

టాప్‌ 10లో...

ముంబై

10

టాప్‌ 50లో...

ముంబై

47

ఢిల్లీ

2

మద్రాస్‌

1

టాప్‌ 100లో...

ముంబై

89

ఢిల్లీ

6

మద్రాస్‌

4

టాప్‌ 500లో...

ముంబై

431

ఢిల్లీ

36

కాన్పూర్‌

5

మద్రాస్‌

21

ఖరగ్‌పూర్‌

3

గౌహతి

1

#Tags