IIT Bombayకు రూ.315 కోట్ల విరాళం.. ఆయన ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం విరాళం ఇంత!!
Sakshi Education
ముంబై: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని(68) ప్రఖ్యాత ఇంజనీరింగ్ విద్యాసంస్థ ఐఐటీ–బాంబేకు మరో రూ.315 కోట్ల విరాళం అందజేశారు.
దీంతో ఈ సంస్థకు ఆయన ఇప్పటిదాకా ఇచ్చిన విరాళం రూ.400 కోట్లకు చేరుకుంది. నందన్ నీలేకని 1973లో ఐఐటీ–బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరారు. ఈ సంస్థతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రూ.315 కోట్ల విరాళం ఇచ్చినట్లు నీలేకని చెప్పారు. ఐఐటీ–బాంబేకు పూర్వ విద్యార్థులు ఇచ్చిన అతిపెద్ద విరాళాల్లో ఇది కూడా ఒకటిగా రికార్డుకెక్కింది. ఆయన గతంలో ఇదే సంస్థకు రూ.85 కోట్ల విరాళం అందజేశారు. ఐఐటీ–బాంబే 1958లో ఏర్పాటయ్యింది. దేశంలో ఇది రెండో ఐఐటీ.
చదవండి:
Published date : 21 Jun 2023 03:12PM