JEE Main Session 2 City Intimation Slip : జేఈఈ మెయిన్ సెషన్ 2 సిటీ ఇన్టిమేషన్ స్లిప్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

సాక్షి ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో తొలి సెషన్ పరీక్షలు ముగిసి ఫలితాలు కూడా విడుదలైయ్యాయి. ఇప్పుడు రెండో సెషన్ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ మెరకు జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు సంబంధించి సిటీ ఇన్టిమేషన్ స్లిప్‌ను విడుదల చేసింది ఎన్‌టీఏ. మార్చి 20న విడుదల చేసిన స్లిప్‌ను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.లో అందుబాటులో ఉంది. విద్యార్థులు కింద ప్రకటించిన విధానం అనుసారంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
చెక్ అండ్ డైన్‌లోడ్ ఇలా..
1. మొదట, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.. jeemain.nta.nic.in.
Education News:ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల ...
2. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 2 సిటీ ఇన్టిమేషన్ స్లిప్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. మరో పేజీ తెరుచుకుంటుంది. ఇక్కడ, మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
4. సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ స్లిప్ కనిపిస్తుంది.
5. స్లిప్‌ను పరిశీలించుకుని, డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.
BCA Exams Time Table : ఏప్రిల్ 3 నుంచి బీసీఏ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు..
తేదీలు.. సమయాలు..
జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష వచ్చే నెల.. ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9వ తేదీల్లో జరగనున్నాయి. బీటెక్, బీఈ పరీక్షలు ఏప్రిల్ 2, 3, 4, 7, 8వ తేదీల్లో జరగనున్నాయి. అయితే, తొలి నాలుగు రోజులపాటు పరీక్షలు రెండు షిప్ట్‌లో.. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకటి, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు మరొకటి జరుగుతాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)