పొరపాట్ల సవరణకు డిసెంబర్ 15 వరకు గడువు: తెలంగాణ ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డు పలు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వచ్చే మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులకు సంబంధించిన వివరాల్లో తప్పులు దొర్లకుండా పక్కా ఏర్పాట్లు చేసింది.
ఫీజు చెల్లించిన విద్యార్థుల వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి వాటిల్లో పొరపాట్లు ఉంటే సవరించుకునేలా అవకాశం కల్పించింది. పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతీ విద్యార్థి వివరాలను వెబ్‌సైట్‌లో (tsbie.cgg.gov.in) అందుబాటులో ఉంచారు. విద్యార్థుల వివరాల్లో పొరపాట్లు ఉంటే డిసెంబర్ 15లోగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర వివరాలతో కాలేజీల ప్రిన్సిపాళ్లు లేదా జిల్లా ఇంటర్ విద్యాధికారి లేదా నోడల్ ఆఫీసర్‌ను కలిసి సవరించుకోవాలని ఉమర్ జలీల్ వివరించారు.
#Tags