జూనియర్ కాలేజీల ప్రవేశాలు ఆన్‌లైన్‌లో...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకునేలా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనరేట్ వెసులుబాటు కల్పించింది.
గతంలో కాలేజీకి వెళ్లి దరఖాస్తును సమర్పించాల్సి ఉండేది. తాజాగా ఆన్‌లైన్ విధానంఅందుబాటులోకి రావడంతో కళాశాలకు వెళ్లాల్సిన పనిలేదు. ఒక్కో విద్యార్థి గరిష్టంగా మూడు కాలేజీల్లో మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంది. దరఖాస్తు చేసుకోవాలనుకున్న విద్యార్థులు https://bie.telangana.gov.in/admweb/#!/GovtColEnro
లింకును తెరిచి వివరాలు నమోదు చేయాలి.
లింకును తెరిచి వివరాలు నమోదు చేయాలి.
#Tags