ఏపీ సీనియర్ ఇంటర్ టాపర్స్ మనోగతాలు
కేన్సర్‌పై రీసెర్చ్ చేస్తా...- ఏపీ ఎంపీసీ ప్రథమ ర్యాంకర్ తేజవర్ధన్‌రెడ్డి కావలి: ప్రపంచంలో కేన్సర్‌కు మందు లేకపోవడంతో చాలామంది చనిపోతున్నారని, క్యాన్సర్‌ను నివారించడానికి రీసెర్చ్ చేయాలనేది తన ధ్యేయమని ఎంపీసీ టాపర్ తేజవర్ధన్‌రెడ్డి పేర్కొన్నాడు. తన తండ్రి కేన్సర్ కారణంగా చనిపోయారని, అందుకే తాను ఆ వ్యాధికి మందును కనుగొనేందుకు సైంటిస్ట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపాడు. మంచి కళాశాలలో బీఎస్సీ, ఎంఎస్సీ చదవి తర్వాత రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదివాడు.
డాక్టర్‌గా పేదలకు సేవలందిస్తా...- ఏపీ ఇంటర్ బైపీసీ గ్రూప్ స్టేట్ టాపర్ ఎం.దీక్షిత
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని బైపీసీ టాపర్ ముక్కు దీక్షిత తెలిపింది. డాక్టర్‌గా సమాజంలో పేదలకు వైద్య సేవలు అందించాలనేది తన ఆశయమని పేర్కొంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన దీక్షిత తండ్రి శ్రీనివాసరావు కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా తల్లి రత్నశ్రీ ప్రైవేట్ పాఠశాల టీచర్‌గా కొనసాగుతున్నారు. వారు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి దీక్షితకు చదువుమీదే ధ్యాస అని పేర్కొన్నారు. స్టేట్ ర్యాంక్ వస్తుందని అనుకున్నాము గానీ స్టేట్ ఫస్ట్ వస్తుందని అనుకోలేదని, తమ కుమార్తె విజయానికి గర్విస్తున్నామని తెలిపారు.
సీఏ చదువుతా- సీఈసీ స్టేట్ ఫస్ట్ సాధించిన గీత
పాలకొల్లు టౌన్: చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కావడం తన లక్ష్యమని ద్వితీయ ఇంటర్ సీఈసీలో స్టేట్ ఫస్ట్ సాధించిన కాదంబరి గీత తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కేవీఎం చాంబర్స్ జూనియర్ కళాశాలలో చదివింది. గీత తండ్రి నర్సింహారావు స్థానికంగా చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి శ్రీదేవి గృహిణి. ఫలితాల విడుదల తర్వాత గీత మాట్లాడుతూ... చిన్నతనం నుంచి తన తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడ్డా తన చదువు విషయంలో శ్రద్ధ చూపించడం వల్ల ఈ ర్యాంకు సాధ్యమైందని పేర్కొంది.
నీట్‌లో మంచి ర్యాంక్ సాధిస్తా..- బైపీసీ రెండో ర్యాంకర్ లక్ష్మీ కీర్తి
నెల్లూరు (టౌన్): నీట్‌లో కూడా ఉత్తమ ర్యాంక్ సాధిస్తానని బైపీసీలో రెండో ర్యాంకర్ లక్ష్మీ కీర్తి తెలిపింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి అంకాలజిస్ట్ లేదా గైనకాలజిస్ట్ గా పనిచేయాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది. నెల్లూరుకు చెందిన నారపనేని లక్ష్మీ కీర్తి.. రత్నం జూనియర్ కళాశాలలో చదివింది. తల్లి శ్వేత ప్రైవేటు ఉద్యోగినిగా పనిచేస్తుండగా, తండ్రి చిన్న తనంలోనే మరణించాడు. కీర్తి అక్క రోహిణి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది.
సాఫ్ట్‌వేర్‌లో రాణించాలన్నదే ఆశయం- ఎంపీసీ సెకండ్ ర్యాంకర్ అఫ్రీన్
గుంటూరు ఎడ్యుకేషన్: ఐఐటీలో సీటు సాధించి కంప్యూటర్ సైన్‌స చదవాలనేది తన లక్ష్యమని ఎంపీసీ రెండో ర్యాంకర్ అఫ్రీన్ తెలిపింది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత స్థారుుకి చేరుకోవాలన్నది తన జీవిత ఆశయమని చెప్పింది. గుంటూరు ఆనందపేట నివాసి అఫ్రీన్ తండ్రి అబ్దుల్ హఫీజ్ ఆర్మీ మాజీ ఉద్యోగి, తల్లి ముంతాజ్ బేగం. అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించానని పేర్కొంది.
కలెక్టర్ కావాలన్నదే లక్ష్యం- ఎంఈసీ రెండో ర్యాంకర్ మీనా
చిత్తూరు ఎడ్యుకేషన్: పటిష్ట ప్రణాళిక, లెక్చరర్ల విద్యాబోధన వల్లనే రాష్ట్ర స్థారుు ర్యాంకు పొందానని ఎంఈసీ రెండో ర్యాంకర్ మీనా తెలిపింది. భవిష్యత్‌లో సివిల్స్ శిక్షణ పొంది కలెక్టర్ కావాలన్నదే ఆశయమని తెలిపింది. చిత్తూరు జిల్లాలోని అరగొండ గ్రామానికి చెందిన చిరువ్యాపారి ప్రసాద్‌బాబు, లక్ష్మీ కుమార్తె మీనా స్థానిక కళాశాలలో చదివి రాష్ట్రస్థారుు ర్యాంకు కై వసం చేసుకుంది.
వైద్యరంగంలో ఉన్నత స్థారుుకి వెళ్తా- జి.జె.శ్రీలత, విజయనగరం, బైపీసీ టాప్‌టెన్ ర్యాంకర్
వైద్యరంగంలోని ఉన్నత స్థారుులో స్థిరపడి మానవాభివృద్ధికి కృషిచేయాలని ఉంది. ప్రాధాన్యతా వైద్య అంశాల్లో పరిశోధనలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
సివిల్స్ సాధించడమే లక్ష్యం
సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 990 మార్కులు సాధించిన ఎం.చందన తెలిపింది. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన రైతు ఎం.శంకర్‌రెడ్డి, ఎం.సరోజమ్మ దంపతుల కుమార్తె ఎం.చందన ప్రజా సేవ చేయడమే తన చిన్ననాటి కల అని తెలిపింది. బీటెక్‌లో ఇంజినీరింగ్ చేసి ఆ పై సివిల్స్ సాధిస్తానని పేర్కొంది.
కార్డియాలజిస్ట్ అవుతా
బాగా చదువుకుని కార్డియాలజిస్ట్ కావడమే తన ధ్యేయమని సీనియర్ ఇంటర్ బైపీసీలో 989 మార్కులు సాధించిన జి.సాయిభావన తెలిపింది. వైఎస్సార్ జిల్లా, నందలూరుకు చెందిన ఏఎస్‌ఐ జీవి రమణయ్య, శారద దంపతుల కుమార్తె సాయి భావన తిరుపతిలో చదువుతోంది. నీట్‌లో మంచి ర్యాంకు సాధిస్తానని సారుుభావన తెలిపింది.
పట్టుదలతో చదివాను- పాండ్రంకి భవానీ
మేము సీతంపేటలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. మా నాన్నఎలక్ట్రికల్ టెక్నీషియన్. ఓ మనసున్న వారి సహకారంతో నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివాను. పట్టుదలతో చదివి 990 మార్కులు సాధించాను. కంప్యూటర్ సైన్‌స ఇంజినీరింగ్ పూర్తిచేసి ఐఏఎస్ అవ్వాలన్నదే లక్ష్యం. కష్టపడి చదివే వారికి పేదరికం అడ్డుకాదని నిరూపిస్తాను. నన్ను చదివిస్తూ అన్ని విధాల సలహాలు సూచనలిస్తున్న సుహాసిని ఆనంద్ మేడమ్‌ను నా జీవితంలో మరచిపోలేను.
ఆో్టన్రాట్ అవుతా..-రొంగలి సత్యసాయిశ్రీ కిరణ్మయి
మాది విశాఖ నగరంలోని విశాలాక్షినగర్. మా అమ్మనాన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఊహించినట్టే ఇంటర్ (ఎంపీసీ)లో 989/1000 మార్కులు వచ్చారుు. ఈ విజయం అధ్యాపకులు, తల్లిదండ్రులు, తాతయ్య బీల సన్నిబాబు, అమ్మమ్మ నారాయణమ్మ వల్లనే సాధ్యమైంది. ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగు చేసి ఆో్టన్రాట్ అవ్వాలనేది ఆశయం. జేఈఈ మెయిన్స్ కూడా బాగా రాశాను. అడ్వాన్‌సకి ప్రిపేర్ అవుతున్నాను.
సివిల్స్ సాధిస్తా- వాయలపల్లి సుష్మ, విజయనగరం, ఎంపీసీ 3వ ర్యాంకర్
తొలుత ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత స్థాయి ఉద్యోగం తెచ్చుకొని సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడానికి కృషిచేస్తాను అని సుష్మ తెలిపింది. అత్యున్నత సేవలందించగల సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ జిల్లాలవారిగా ఉత్తీర్ణతా శాతం

జిల్లా | ఉత్తీర్ణులు | శాతం |
కృష్ణా | 50,514 | 84 |
నెల్లూరు | 20,451 | 77 |
గుంటూరు | 33,707 | 76 |
చిత్తూరు | 31,610 | 75 |
పశ్చిమగోదావరి | 22,570 | 75 |
విశాఖపట్నం | 33,662 | 74 |
కర్నూలు | 32,347 | 72 |
విజయనగరం | 14,370 | 71 |
తూర్పు గోదావరి | 28,928 | 70 |
ప్రకాశం | 16,030 | 69 |
అనంతపురం | 19,406 | 68 |
శ్రీకాకుళం | 17,327 | 65 |
వైఎస్సార్ | 11,903 | 59 |
మొత్తం | 3,23,645 | 73 |
#Tags