ఏపీ ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ ఫలితాల విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఏప్రిల్ 12నసచివాలయంలోని కాన్ఫరెన్సు హాలులో విడుదల చేశారు. మొత్తం 9.65 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 6.3 లక్షల మంది పాసయ్యారు. 3.3 లక్షల మంది ఫెయిలయ్యారు. 52 వేల మంది గైర్హాజరయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం చూస్తే ఇంటర్ ఫస్టియర్‌లో జనరల్‌లో 60 శాతం, వొకేషనల్‌లో 49 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో జనరల్‌లో 72 శాతం, వోకేషనల్‌లో 69 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా, ఇంటర్ ఫస్టియర్‌లో 4,76,419 మంది హాజరవ్వగా 2,86,899 (60శాతం) మంది పాసయ్యారు. సెకండియర్లో 4,31,739 పరీక్ష రాయగా 3,09,613 (72శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
#Tags