Complaint on Principal: ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల ప్రిన్సిపాల్ పై ఫిరియాదు.. కార‌ణం?

ప్రిన్సిపాల్ మాకు వొద్దు అంటూ క‌ళాశాలలో అందురూ ధ‌ర్నాకు దిగారు. ఈ నేప‌థ్యంలోనే వారంతా స‌మీప పోలిస్ స్టేషన్ లో ఫిరియాదు చేశారు. అస‌లు కారణం..
Students and Teachers of Junior college on Strike

సాక్షి ఎడ్యుకేష‌న్: ‘ప్రిన్సిపాల్‌ వేధింపులు భరించలేకున్నాం. ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు’ అంటూ గుత్తి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది శుక్రవారం కాలేజీలో ధర్నాకు దిగారు. వారి వివరాల మేరకు.. ఇటీవలే సంజిత్‌నాయక్‌ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న రోజు నుంచే అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం ప్రారంభించాడని వారు ఆరోపించారు.

➤   Flint Science Competitions: విద్యార్థుల నైపుణ్య పోటీలు..

ఏదో ఒక కారణంతో అధ్యాపకులను, విద్యార్థులను, సిబ్బందిని వేధిస్తున్నారన్నారు. గతంలో పని చేసిన కాలేజీల్లో కూడా ఇలాగే ప్రవర్తించడంతో రెండు, మూడు సార్లు ఆయన సస్పెండ్‌ అయినట్లు తెలుస్తోంది. ధర్నా అనంతరం అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పోలీసు స్టేషన్‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌పై సీఐ వెంకటరామిరెడ్డికి ఫిర్యాదు చేయగా ఆయన విచారణ చేపట్టారు.

#Tags