Skip to main content

Flint Science Competitions: విద్యార్థుల నైపుణ్య పోటీలు..

న‌వంబ‌ర్ లో నిర్వ‌హించ‌నున్న ఈ నైపుణ్య పోటీలు ఏటా జ‌రిగే చెకుముకి సైన్స్ పోటీలే. దీనికి సంబంధించి గోడ‌ప‌త్రిక‌ను డీఈఓ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ.. పోటీ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.
Flint science competitions for students
Flint science competitions for students

సాక్షి ఎడ్యుకేష‌న్: జీవీఎంసీ విలీన గ్రామమైన కొత్తూరులోని జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో చెకుముకి సైన్స్‌ సంబరాల గోడపత్రికను డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.త్రిమూర్తులు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 8, 9, 10 తరగతుల విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఏటా చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు.

➤   National Level Chess Competitions: చెస్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో పోటీలు

ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు సహకరించాలని కోరారు. వచ్చే నెల 10న పాఠశాల స్థాయి, 30న మండల స్థాయి, డిసెంబర్‌ 17న జిల్లా స్థాయి, 2024 జనవరి 27, 28 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. విద్యాశాఖ ఏడీ ఆడారి రవికుమార్‌, జన విజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి బి.ఉమామహేశ్వరరావు, విజ్ఞాన వేదిక నాయకులు, రిసోర్స్‌ పర్సన్లు పాల్గొన్నారు.

Published date : 28 Oct 2023 12:23PM

Photo Stories