TS ICET 2024: నేడే టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష.. రేపటి షెడ్యూల్ ఇదే
తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ పరీక్షను జూన్ 5,6 తేదీల్లో నిర్వహించనున్నారు. ఐసెట్ పరీక్ష కోసం మొత్తం 84,750 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 5, 6 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్, జూన్6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరగనుంది.
JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఆన్సర్ కీ విడుదల..
ఈ ఏడాది వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) పరీక్ష నిర్వహిస్తుంది. జూన్ 15న ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. జూన్ 28న ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల చేయనున్నారు.
#Tags