Lights in Physics for Competitive Exams : భౌతిక శాస్త్రంలో కాంతులు వివరంగా.. పోటీ పరీల్లో ఉపాయోగపడేందుకు ఈ బిట్స్..
దృష్టి లోపాలు– రకాలు
➦ హ్రస్వదృష్టి: కంటికి దగ్గరగా ఉన్న వస్తువులను మాత్రమే చూడగలిగి, దూరంగా ఉన్న వాటిని సరిగా చూడలేకపోవడాన్ని ‘హ్రస్వదృష్టి’ అంటారు. తగిన నాభ్యంతరం ఉన్న వికేంద్రీకరణ (పుటాకార) కటకాన్ని ఉపయోగించి ఈ లోపాన్ని నివారించవచ్చు.
➦ దూరదృష్టి(లేదా)దీర్ఘదృష్టి: కంటికి దూరంగా ఉన్న వస్తువులను మాత్రమే చూడగలిగి దగ్గరగా ఉన్న వాటిని చూడలేకపోవడాన్ని ‘దూరదృష్టి’ అంటారు. తగిన నాభ్యంతరం ఉన్న కేంద్రీకరణ(కుంభాకార) కటకాన్ని ఉపయోగించి ఈ లోపాన్ని నివారించవచ్చు.
➦ అసమదృష్టి: కంటిలోని కార్నియాలో లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ లోపం ఉన్న వ్యక్తులు ఒక వస్తువును చూసినప్పుడు అది అడ్డుగీతలు లేదా నిలువు గీతలుగా మాత్రమే కనిపిస్తుంది. ఈ లోపాన్ని సవరించడానికి స్తూపాకార కటకం వాడతారు.
➦ చత్వారం: కొంత మందిలో వయసు పెరుగుతున్న కొద్దీ కన్ను దాని నేత్రానుగున్యతను కోల్పో తుంది. ఫలితంగా దగ్గరగా ఉన్న వస్తువును లేదా కొంత దూరంలో ఉన్న వస్తువును చూడ టం వీలుకాదు. ఈ దృష్టి లోపాన్ని సవరించడానికి ద్వినాభి కటకాన్ని ఉపయోగిస్తారు.
➦ రేచీకటి: విటమిన్–ఎ లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. రేచీకటితో బాధపడే వారు పగటి సమయంలో మాత్రమే చూడగలుగు తారు. రాత్రివేళలో కృత్రిమ కాంతి జనకాల నుంచి వచ్చే కాంతి తీవ్రత వీరిలో దృష్టిజ్ఞానా న్ని ప్రేరేపించదు. ఈ సమస్య నివారణకు విటమిన్–ఎ ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి.
➦ వర్ణాంధత్వం: కంటిలోని కోన్లలో తలెత్తే లోపం వల్ల వర్ణాంధత్వం కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు అన్ని రంగులను గుర్తించలేరు. తల్లిదండ్రుల జన్యువుల ద్వారా పిల్లలకు సంక్రమిస్తుంది. ఈ దృష్టి లోపాన్ని నివారించడానికి ఎలాంటి ఔషధాలు, చికిత్సా విధానం అందుబాటులో లేదు.
T20 World Cup: టీ20 ప్రపంచకప్.. బంగ్లాదేశ్‌లో కాదు.. యూఏఈలో..
అదృశ్య వికిరణాలు
➦ పరారుణ కిరణాలు: వీటిని విలియం హెర్షెల్ కనుగొన్నాడు. వీటి తరంగదైర్ఘ్య అవధి
7,500Å- 40,00,000Å. అన్ని రకాల గాజు పదార్థాలు ఈ కిరణాలను శోషించుకుంటాయి. రాతి ఉప్పుతో తయారైన పట్టకాలు, కటకాల ద్వారా ఈ తరంగాలు చొచ్చుకొని వెళ్లలేవు. కాబట్టి ఈ కటకాలను ఉపయోగించి పరారుణ కిరణాల ఉనికిని తెలుసుకోవచ్చు.
➦ పరారుణ కిరణాలు తమ వెంట ఉష్ణాన్ని మోసుకెళుతూ ఎదురుగా ఉన్న వస్తువులను తాకినప్పుడు వాటికి ఉష్ణాన్ని బదిలీ చేస్తాయి. అందువల్ల ఈ కిరణాలను ఉష్ణ వికిరణాలు అని కూడా అంటారు. ఉష్ణ వికిరణ సూత్రం ఆధా రంగా థర్మోఫైల్, బోలోమీటర్ సాధనాలను ఉపయోగించి పరారుణ కిరణాల ఉనికిని తెలుసుకోవచ్చు.
అనువర్తనాలు
➦ కండరాల నొప్పి, బెణకడం వల్ల వచ్చే నొప్పుల నివారణకు పరారుణ కిరణాలను ఉపయోగి స్తారు. పక్షవాతానికి చికిత్సలో, టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారాల్లో వీటిని వినియోగిస్తారు.
➦ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రహస్య సాంకేతికాలను ప్రసారం చేయడానికి ఈ కిరణాలు ఉపయోగపడతాయి.
➦ రిమోట్ సెన్సింగ్ విధానంలో వాడతారు.
➦ గోడలపై ఉన్న పాత చిత్రలేఖనాలను తొలగించడానికి ఉపయోగిస్తారు.
➦ పరారుణ కిరణాల తరంగదైర్ఘ్యం ఎక్కువ. అందువల్ల పొగమంచు, దుమ్ము, ధూళి కణాల ద్వారా ఈ తరంగాలు తక్కువ పరిక్షేపణం చెందుతాయి. రుజుమార్గంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. కాబట్టి ఇలాంటి పదార్థాల ద్వారా వస్తువులను చూడటానికి, ఫొటోలు తీయడానికి ఈ కిరణాలను వాడతారు.
➦ భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహాలను నియంత్రించడానికి వాడతారు.
➦ నైట్ విజన్ కెమెరా, బైనాక్యులర్లలో ఈ కిరణా లను వాడతారు. రాత్రి వేళల్లో ఈ పరికరాలతో వస్తువులను స్పష్టంగా చూడవచ్చు.
CP Kalmeswar: పోటీ పరీక్షల్లో రాణించడం అభినందనీయం
➦ పరిశ్రమల బట్టీలు, కొలిమిల్లో ఎక్కువ ఉష్ణోగ్ర తలను సృష్టించడానికి వాడతారు.
➦ పరారుణ కిరణాల ఆధారంగా వస్తువుల ఉష్ణో గ్రతను కొలిచే పద్ధతిని థర్మోగ్రఫీ అంటారు.
➦ గ్లోబల్ వార్మింగ్‌ను, ఒక ప్రదేశంలోని శీతోష్ణస్థితులను అధ్యయనం చేయడానికి ఈ తరంగాలను ఉపయోగిస్తారు.
➦ టెలిస్కోప్ పనిచేయడానికి కూడా ఈ కిరణాలను ఉపయోగిస్తారు.
➦ అతినీలలోహిత కిరణాలు: వీటిని రిట్టెర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. వీటి తరంగదైర్ఘ్య అవధి 100్య –4000్య. క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ కిరణాల శక్తి చాలా ఎక్కువ. క్వార్ట్ ్జగాజు మినహా మిగతా గాజు పదార్థాలన్నీ ఈ కిరణా లను శోషించుకుంటాయి. అందువల్ల క్వార్ట్ ్జతో నిర్మించిన కటకాలు, పట్టకాలను ఉపయోగించి ఈ కిరణాల ఉనికిని తెలుసుకోవచ్చు.
➦ గమనిక: అతినీలలోహిత కిరణాలను తేనెటీగలు చూడగలుగుతాయి.
అనువర్తనాలు
➦ పాలు, నీళ్లలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నశింపజేయడానికి, ఆహార పదార్థాలను మన్నికగా ఎక్కువ కాలం నిల్వ చేయడానికి అతినీలలోహిత కిరణాలను ఉపయోగిస్తారు.
గమనిక: ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం వాటిలో సోడియం బెంజోయేట్‌ను కలుపుతారు.
➦ వైద్య రంగంలో స్టెరిలైజేషన్ కోసం (హానిక రమైన బ్యాక్టీరియాను నశింపజేయడానికి) ఈ కిరణాలను ఉపయోగిస్తారు.
➦ పాడైన కోడిగుడ్లను గుర్తించడానికి వాడతారు.
➦ సహజ, కృతిమ దంతాల మధ్య తేడాలను తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు.
➦ టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారాల్లోనూ వినియోగిస్తారు.
➦ తొలిదశలో ఉన్న కేన్సర్ గడ్డలను కరిగించడాని కి వీటిని వాడతారు.
➦ వేలిముద్రలను విశ్లేషించడానికి వాడతారు.
➦ వృక్షాలు కిరణజన్య సంయోగక్రియ జరపడాని కి వీటిని ఉపయోగించుకుంటాయి.
➦ అతినీలలోహిత కిరణాలు మన శరీరంపై పడినప్పుడు 1 మి.మీ. లోతుకు చొచ్చుకెళ్లి విటమిన్–డిని ప్రేరేపిస్తాయి. రికెట్స్ వ్యాధి రాకుండా విటమిన్–డి తోడ్పడుతుంది.
➦ నకిలీ డాక్యుమెంట్లు, కరెన్సీ నోట్లను గుర్తించడానికి వినియోగిస్తారు.
Jobs for Freshers: ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఫ్రెషర్లకు ఆహ్వానం.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
➦ నష్టాలు: సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల శక్తి అధికంగా ఉంటుంది. వీటి ద్వారా చర్మ కేన్సర్ సోకుతుంది. ఈ కిరణాలు నేరుగా భూమిని చేరకుండా వాతావరణంలోని ఓజోన్ పొర శోషించుకుంటుంది. కానీ క్లోరోఫ్లోరో కార్బన్‌లు, ఫ్రియాన్ వాయువుల వల్ల ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడుతున్నాయి. వీటి ద్వారా అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరుతాయి.
➦ రేడియో తరంగాలు: వీటి తరంగదైర్ఘ్య అవధి 1 మిల్లీమీటరు నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇవి ఒక రకమైన విద్యుదయస్కాంత కిరణాలు. కాబట్టి శూన్యంలో, గాలిలో రేడియో తరంగాల వేగం కాంతి వేగానికి
(C = 3.108 m/s) సమానంగా ఉంటుంది.
అనువర్తనాలు
➦ రేడియో కార్యక్రమాల ప్రసారాల్లో వినియో గిస్తారు.
➦ టెలిస్కోప్‌లు పనిచేయడానికి వాడతారు.
➦ రాడార్‌లు పనిచేయడానికి ఉపయోగిస్తారు.
➦ వాతావరణంలోని మార్పులను ముందుగా గుర్తించడానికి ఈ తరంగాలను ఉపయోగిస్తారు.
➦ మైక్రోవేవ్స్: వీటి తరంగదైర్ఘ్య అవధి 1 మీటరు – 1 మిల్లీ మీటరు. మైక్రో తరంగాలు ఒక రకమైన విద్యుదయస్కాంత తరంగాలు. గాలిలో, శూన్యంలో వీటి వేగం కాంతి వేగానికి సమానం.
అనువర్తనాలు
➦ నావిగేషన్ విధానంలో (వాహనాలు, నౌకలు, విమానాల మార్గాలను తెలుసుకోవడానికి) ఉపయోగిస్తారు.
➦ టెలిమెట్రీ విధానంలో వాడతారు. భూమి నుంచి ఒక అంతరిక్ష నౌక మధ్య ఉండే దూరాన్ని కొలిచే పద్ధతిని టెలిమెట్రీ అంటారు.
➦ భూమి ఉపరితలం నుంచి మేఘాల ఎత్తు, అవి కదిలే దిశను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.
➦ ఆప్టికల్ ఫైబర్ ద్వారా సమాచార ప్రసారం కోసం వీటిని వినియోగిస్తారు.
➦ మైక్రో ఓవెన్‌లో ఆహార పదార్థాలను వేడిచేయడానికి వాడతారు.
➦ ఈ తరంగాలు ఆహార పదార్థంలోని అణువుల లోపలికి చొచ్చుకెళ్లి వాటి కంపనాలను పెంచుతాయి. అందువల్ల ఈ కణాల కంపన శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. ఫలితంగా ఆహార పదార్థాలు వేడుక్కుతాయి.
➦ అల్యూమినియం, రాగి, ఇనుము తదితర లోహాల ద్వారా మైక్రోవేవ్స్ చొచ్చుకెళ్లలేవు. కానీ అలోçహాలైన గాజు, ప్లాస్టిక్, పేపర్ తదితరాల ద్వారా చొచ్చుకెళతాయి. కాబట్టి అలోహ పదార్థాలతో తయారుచేసిన పాత్రల్లో మాత్రమే ఆహార పదార్థాలను ఉంచి మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేయాలి. మైక్రో ఓవెన్‌ను స్పెన్సర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
Job Mela: రేపు ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా.. అర్హులు వీరే..
మాదిరి ప్రశ్నలు
1. ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయడంలో ఇమిడి ఉన్న ధర్మం?
1) రుజువర్తనం 2) వ్యతికరణం
3) సంపూర్ణాంతర పరావర్తనం
4) వివర్తనం
2. కాంతి వ్యతికరణాన్ని కనుగొన్నది ఎవరు?
1) హైగెన్స్ 2) థామస్ యంగ్
3) న్యూటన్ 4) గ్రిమాల్డి
3. కాంతి పరిక్షేపణం దేనిపై ఆధారపడుతుంది?
1) కాంతి కిరణాల కోణం
2) కాంతి తరంగ దైర్ఘ్యం
3) కాంతి కిరణం ఢీకొంటున్న కణాల పరిమాణం 4) పైవన్నీ
4. ఆకాశం నిజమైన రంగు ఏది?
1) నీలం 2) నలుపు
3) తెలుపు 4) వర్ణ రహితం
5. నీటిపై నూనెను వెదజల్లినప్పుడు రంగులు కనిపించడానికి కారణం?
1) వ్యతికరణం 2) వక్రీభవనం
3) రుజువర్తనం 4) విశ్లేషణం
AP Schools: ఈనెల 27 నుంచి సెల్ఫ్ అసెస్‌మెంట్ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే
6. సీడీ, డీవీడీలపై కాంతి పతనమైనప్పుడు భిన్న రంగులు కనిపించడానికి కారణం?
1) రుజువర్తనం 2) వివర్తనం
3) విశ్లేషణం 4) ధ్రువణం
7. ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణమయ్యే కాంతి ధర్మం?
1) వక్రీభవనం 2) విశ్లేషణం
3) సంపూర్ణాంతర పరావర్తనం
4) పైవన్నీ
8. హోలోగ్రఫీ విధానాన్ని ఆవిష్కరించింది ఎవరు?
1) గేబర్ 2) ఫెర్నీ
3) ఫారడే 4) బ్రటేయిన్
9. రామన్ ఫలితంలోని కాంతి ధర్మం ఏది?
1) రుజువర్తనం 2) పరిక్షేపణం
3) విశ్లేషణం 4) ధ్రువణం
సమాధానాలు
1) 3; 2) 2; 3) 4; 4) 4; 5) 1; 6) 2; 7) 4; 8) 1; 9) 2.