General Studies Bit Bank in Telugu: 'గోల్డెన్ రైస్'ను సృష్టించిన శాస్త్రవేత్త ఎవరు?
బయాలజీ
1. 'బయోటెక్నాలజీ' (జీవ సాంకేతిక శాస్త్రం) అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినవారు?
1) జాన్కోల్ రీటర్
2) వాక్స్మెన్
3) కార్ల్ ఎరికే
4) లీవెన్ హక్
- View Answer
- సమాధానం: 3
2. కిందివాటిలో సరైన వాక్యాలు ఏవి?
ఎ) 'డాలి'.. ప్రపంచంలో మొదటిసారిగా సృష్టించిన క్లోన్డ్ గొర్రెపిల్ల. దీన్ని'రోసేలిన్ ఇన్స్టిట్యూట్' శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ సృష్టించారు
బి) 'ఈవ్'.. మొదటి క్లోన్డ్ బేబీ. దీన్ని సృష్టించిన సంస్థ 'సియోల్ నేషనల్ యూనివర్సిటీ'
సి) సంరూప, గరిమా అనే పెయ్య దూడలను సృష్టించింది నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ),కర్నాల్ (హర్యానా)
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
3. 'ఇంటర్ఫెరాన్'లను ప్రధానంగా ఏ జీవులు ఉత్పత్తి చేస్తాయి?
1) అకశేరుకాలు
2) సకశేరుకాలు
3) బ్యాక్టీరియాలు
4) శిలీంధ్రాలు
- View Answer
- సమాధానం: 2
4. ఇంటర్ఫెరాన్లను కనుగొన్నవారు?
1) గిల్బర్ట్, వీస్మన్
2) కోహ్లర్, మిల్స్టీన్
3) నాథన్స్
4) థామ్సన్
- View Answer
- సమాధానం: 1
చదవండి: Biology Practice Test
5. కిందివాటిలో జన్యు పరివర్తిత మొక్కకు ఉదాహరణ?
1) వరిలో IR-8
2) గోల్డెన్ రైస్
3) సజ్జలో పూసా మోతి
4) వేరుశనగలో TMV-3
- View Answer
- సమాధానం: 2
6. కిందివాటిలో 'బ్యాక్టీరియల్ పెస్టిసైడ్' ఏది?
1) బాసిల్లస్ ఆంథ్రాసిస్
2) బాసిల్లస్ ఫాలిమిక్సా
3) క్లాస్ట్రీడియం బొట్సులినమ్
4) బాసిల్లస్ థురింజియాన్సిస్
- View Answer
- సమాధానం: 4
7. 'తైపేయి' అనేది ఏ పంట రకం?
1) జొన్న
2) గోధుమ
3) వరి
4) సజ్జ
- View Answer
- సమాధానం: 3
8. 'గోల్డెన్ రైస్'ను ఏవిధంగా ఉత్పత్తి చేస్తారు?
1) వరిలోని పూసా రకాన్ని ఐఖ8 రకంతో సంకరణం చేయడం ద్వారా
2) తైపేయి అనే వరి రకంలో 'విటమిన్-ఎ'ను ఉత్పత్తి చేసే మూడు జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా
3) అధిక దిగుబడిని సాధించడానికి వరిలోని 'అనామిక' రకంలోకి జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా
4) వరిలోని 'బీరాజ్' రకంలో ఉత్పరివర్తనాలను కలిగించడం ద్వారా
- View Answer
- సమాధానం: 2
9. సూక్ష్మజీవులను ఉపయోగించి.. నేల లేదా నీటి నుంచి అనవసర వ్యర్థ పదార్థాలు, కాలుష్య కారకాలను తొలగించే పద్ధతిని ఏమంటారు?
1) బయోఇన్ఫర్మేటిక్స్
2) ప్రోటియోమిక్స్
3) బయోరెమిడియేషన్
4) జీనోమిక్స్
- View Answer
- సమాధానం: 3
చదవండి: Study Material
10. జున్ను ఉత్పత్తికి ఉపయోగించే జంతు ఎంజైమ్ ఏది?
1) పపేన్
2) రెన్నెట్
3) లైపాక్సిజినేజ్
4) లైపేజ్
- View Answer
- సమాధానం: 2
11. మాంసం మృదుత్వానికి, తోళ్లను మెత్తబరచడానికి ఉపయోగించే ఎంజైమ్‌లు వరసగా?
1) పపేన్, రెన్నెట్
2) పపేన్, ప్రోటియేజ్
3) ప్రోటియేజ్, ట్రిప్సిన్
4) రెన్నెట్, లైపేజ్
- View Answer
- సమాధానం: 2
12. 'గోల్డెన్ రైస్'ను సృష్టించిన శాస్త్రవేత్త?
1) కొహ్లెర్
2) నాథన్స్
3) నార్మన్ బోర్లాగ్
4) ఇంగోపాట్రికుస్
- View Answer
- సమాధానం: 4
13. కిందివాటిలో జన్యుపరివర్తిత మొక్కకు ఉదాహరణ?
1) బంగారు వరి
2) బంగారు వేరుశనగ
3) బి.టి. పత్తి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
14. కణజాలవర్ధనం (టిష్యూ కల్చర్) ప్రధానంగా ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
1) కణ æసిద్ధాంతం
2) సెల్యులార్ టోటిపొటెన్సీ
3) కణ వంశానుక్రమ సిద్ధాంతం
4) ఆమ్నిస్ సెల్యులా - ఇ - సెల్యులా
- View Answer
- సమాధానం: 2
చదవండి: Right to Equality (Article 14-18): 'సమన్యాయ పాలన'ను ప్రతిపాదించిందెవరు?
15. 'సెల్యులార్ టోటిపొటెన్సీ' అంటే..?
1) ఒక కణం క్షయకరణ విభజన చెందగలిగే శక్తి
2) సరైన నియంత్రణ పరిస్థితుల్లో.. ఆక్సిన్ - సైటోకైనిన్‌లను ఉపయోగించి ప్రకాండ వ్యవస్థను ప్రేరేపించడం
3) అతి శీతల అ«భిచర్య జరిపి ఒక మొక్కలో పుష్పోత్పత్తిని ప్రేరేపించడం
4) అనుకూల పరిస్థితుల్లో కొత్త మొక్కను ఏర్పర్చగలిగే కణం అంతర్గత సామర్థ్యం
- View Answer
- సమాధానం: 4
16. తొలిసారిగా 'టోటిపొటెన్సీ' అనే పదాన్ని ఉపయోగించినవారు?
1) మోర్గాన్
2) స్టీవార్డ్
3) ముల్లర్
4) హేబర్ లాండ్
- View Answer
- సమాధానం: 1
17. 'కణజాలవర్ధన పితామహుడు' ఎవరు?
1) ఎఫ్.సి. స్టీవార్డ్
2) మోర్గాన్
3) హేబర్ లాండ్
4) ముల్లర్
- View Answer
- సమాధానం: 3
18. కణజాలవర్ధనంలో యానకం pH విలువ ఏ విధంగా ఉండాలి?
1) 3.0 5.0
2) 7.2 8.0
3) 5.6 6.0
4) 6.3 7.4
- View Answer
- సమాధానం: 3
19. కణజాలవర్ధనంలో ఎక్కువగా ఉపయోగించే యానకం ఏది?
1) B.S. యానకం
2) S.M. యానకం
3) M.S. యానకం
4) L.S. యానకం
- View Answer
- సమాధానం: 3
చదవండి: Groups Preparation Tips: గ్రూప్స్..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్ కొట్టేలా!
20. మౌలిక (బేసిక్) యానకంలో లోపించేవి?
1) సూక్ష్మ మూలకాలు
2) విటమిన్లు
3) కార్బొహైడ్రేట్లు
4) వృద్ధి నియంత్రకాలు
- View Answer
- సమాధానం: 4
21. కణజాలవర్ధనంలో ఏర్పడే'అవయవ విభేదనం'చెందని కణాల సముదాయాన్ని ఏమంటారు?
1) కాలస్
2) కాలోస్
3) క్లోన్
4) ఎక్స్‌ప్లాంట్
- View Answer
- సమాధానం: 1
22. 'సోడియం ఆల్జినేట్'తో రక్షణ కవచాలను ఏర్పర్చి, గుళికలుగా మార్చే నిర్మాణాలను ఏమంటారు?
1) ప్లాస్మిడ్లు
2) ప్లాస్టిడ్లు
3) సంశ్లేషిత/ కృత్రిమ విత్తనాలు
4) సైటోప్లాస్ట్లు
- View Answer
- సమాధానం: 3
23. జతపరచండి.
జాబితా I
a) సోడియం హైపోక్లోరైట్
b) మెర్క్యురిక్ క్లోరైడ్
c) సోడియం ఆల్జినేట్
d) సాయిల్ రైట్
జాబితా II
i) విత్తనాల ఉపరితలాన్ని సూక్ష్మజీవ రహితం చేయడం
ii) వర్ధనం చేసిన మొక్కలను నాటడం
iii)ఎక్స్‌ప్లాంట్‌ను సూక్ష్మజీవరహితం చేయడం
iv) పిండాలను గుళికలుగా మార్చడం
1) a-iii, b-i, c-iv, d-ii
2) a-iii, b-i, c-ii, d-iv
3) a-iv, b-ii, c-iii, d-i
4) a-i, b-iii, c-ii, d-iv
- View Answer
- సమాధానం: 1
24. జతపరచండి.
జాబితా I
a) సోమాక్లోనల్ వైవిధ్యాలు
b) సూక్ష్మ వ్యాప్తి
c) శాఖీయ పిండోత్పత్తి
d) అక్లిమటైజేషన్ (వాతావరణానుకూలత)
జాబితా II
i) కాలస్ నుంచి పిండాల లాంటి నిర్మాణాల అభివృద్ధి
ii) కణజాలవర్ధనంలో ఏర్పడిన మొక్క ప్రదర్శించే వైవిధ్యాలు
iii) కణజాలవర్ధనం ద్వారా పెద్దమొత్తంలో తక్కువ స్థలంలో మొక్కలను ఉత్పత్తి చేయడం
iv) కణజాలవర్ధనం ద్వారా ఏర్పడిన మొక్కలు వాతావరణ అనుకూలతను ప్రదర్శించడం
1) a-ii, b-iii, c-iv, d-i
2) a-ii, b-iii, c-i, d-iv
3) a-i, b-ii, c-iii, d-iv
4) a-ii, b-i, c-iii, d-iv
- View Answer
- సమాధానం: 2
చదవండి: Groups Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
25. కిందివాటిలో సరైన వరస క్రమం ఏది?
ఎ) బయోపెస్టిసై ---> బాసిల్లస్ థురింజి యాన్సిస్ ---> మాంసం మృదుత్వానికి ఉపయోగపడుతుంది
బి) బాక్యులో వైరస్ ---> ఎన్.పి.వి.---> ఆర్థ్రోపాడ్ కీటకాలను వ్యాధిగ్రస్థం చేస్తుంది
సి) వరిలో తైపేయి రకం ---> గోల్డెన్ రైస్ ---> విటమిన్-ఎ ను ఉత్పత్తి చేస్తుంది
డి) బీటీ పత్తి ---> బీటీ విషపదార్థం ---> తోళ్లను మెత్తబరుస్తుంది
1) ఎ, బి
2) సి, డి
3) బి, సి
4) ఎ, డి
- View Answer
- సమాధానం: 3
గతంలో అడిగిన ప్రశ్నలు
1. యాంటీబయాటిక్స్‌కు ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు అభివృద్ధి పరచిన నూతన ఔషధం పేరు?
(వీఆర్వో-2018)
1) ఆర్బాక్టివ్
2) డాల్వేన్స్
3) సిక్సెర్ట్రో
4) స్టెఫ్ఎఫెక్ట్
- View Answer
- సమాధానం: 4
2. బెరిబెరి అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? (కానిస్టేబుల్-2016)
1) C
2) D
3) B1
4) B5
- View Answer
- సమాధానం: 3
3. జతపరచండి? (కానిస్టేబుల్-2016)
జాబితా-1
ఎ) ఫ్లావర్ - సేవర్ టమాట
బి) గోల్డెన్ రైస్
సి) రౌండ్ అప్ రెడి సోయా చిక్కుడు
డి) Bt- పత్తి
జాబితా-2
i) కీటకాల ప్రతిరోధకత
ii) గుల్మనాశకుల ప్రతిరోధకత
iii) ఎక్కువ విటమిన్- అ
iv) పక్వతలో ఆలస్యం
1) ఎ-iv, బి-iii, సి-i, డి-ii
2) ఎ-ii, బి-iii, సి-iii, డి-i
3) ఎ-iv, బి-iii, సి-ii, డి-i
4) ఎ-ii, బి-iv, సి-i, డి-iii
- View Answer
- సమాధానం: 3
4. అణు కత్తెరలుగా అభివర్ణించబడే ఎంజైమ్ ఏది? (కానిస్టేబుల్-2016)
1) డీఎన్ఏ లైగేజ్
2) డీఎన్ఏ పాలిమరేజ్
3) రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్
4) రివర్స్ ట్రాన్స్క్ట్రిప్టేజ్
- View Answer
- సమాధానం: 3
చదవండి: TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట కోసం.. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుల సూచనలు- సలహాలు ..
5. విపరీతమైన, తీవ్రమైన శ్వాసకోస సిండ్రోమ్ (SARS) దేని వల్ల సంభవిస్తుంది? (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్-2018)
1) బాక్టీరియా
2) ఫంగి(శిలీంధ్రాలు)
3) ప్రోటోజోవాలు(ఏక కణ సూక్ష్మజీవులు)
4) వైరస్
- View Answer
- సమాధానం: 4
6. జతపరచండి? (ఎస్సై-2018)
జాబితా-1
ఎ) మైకాలజీ
బి) పేలినాలజీ
సి) అంకాలజీ
డి) పేలియాంటాలజీ
జాబితా-2
i) పరాగ రేణువుల అధ్యయనం
ii) క్యాన్సర్‌కి సంబంధించినది
iii) శిలాజాల గురించి అధ్యయనం
iv) శిలీంధ్రాల గురించి అధ్యయనం
1) ఎ-iii, బి-ii, సి-i, డి-iv
2) ఎ-ii, బి-iii, సి-iv, డి-i
3) ఎ-iv, బి-i, సి-ii, డి-iii
4) ఎ-i, బి-ii, సి-iv, డి-iii
- View Answer
- సమాధానం: 3
7. జతపరచండి? (ఎస్సై-2018)
జాబితా-1(మొక్క)
ఎ) బంగాళాదుంప
బి) క్యారెట్
సి) ఆపిల్
డి) కాబేజీ
జాబితా-2(తిన యోగ్యమైన భాగం)
i) ఉబ్బిన పుష్పాసనం
ii) శాఖీయ మొగ్గ
iii) రూపాంతరం చెందిన వేరు
iv) రూపాంతరం చెందిన కాండం
1) ఎ-iv, బి-iii, సి-i, డి-ii
2) ఎ-iii, బి-ii, సి-i, డి-iv
3) ఎ-ii, బి-i, సి-iv, డి-iii
4) ఎ-ii, బి-iv, సి-i, డి-iii
- View Answer
- సమాధానం: 1