APPSC Group 1 & 2 Jobs Awareness Programs: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో.. గ్రూప్–1, 2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు
☛ నవంబర్ 4వ తేదీన శ్రీకాకుళంలో సదస్సు
☛ నవంబర్ 5వ తేదీన విజయనగరంలో సదస్సు
☛ గెస్ట్ స్పీకర్‌గా సివిల్స్ విజేత బాలలత
☛ లక్ష్యం : గ్రామీణ, పట్టణ విద్యార్థులకు గ్రూప్1,2 పరీక్షలపై అవగాహన కల్పించడం
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్–1,2 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో..గ్రామీణ, పట్టణ విద్యార్థులను గ్రూప్–1,2 స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో.. సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com ) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో ఉచిత అవగాహన సదస్సులను నిర్వహించనుంది. ఇందులో భాగంగా మొదట నవంబర్ 4వ తేదీన(శనివారం) శ్రీకాకుళంలో, అలాగే నవంబర్ 5వ తేదీన (ఆదివారం) విజయనగరంలో ఈ అవగాహన సదస్సులను నిర్వహించనుంది. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు సాక్షిఎడ్యుకేషన్.కామ్ తోడుగా ఉంటున్న విషయం మీ అందరికి తెల్సిందే.
గెస్ట్ స్పీకర్‌గా బాలలత :
ఎంతో మందిని పోటీ పరీక్షల్లో విజేతలుగా తీర్చిదిద్దుతున్న సివిల్స్ టాపర్ బాలలత గారు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సుకు గెస్ట్ స్పీకర్‌గా హాజరుకానున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి 13 జిల్లాల్లోని గ్రూప్-1,2 పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు అవగాహన కల్పించడంతో పాటు వీరికి ఉన్న సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 8977625795 ఫోన్ నెంబర్‌కు తమ పేరు, ఫోన్ నెంబర్, జిల్లా వివరాలను వాట్సప్‌లో పంపగలరు.
ముఖ్య సమాచారం:
శ్రీకాకుళంలో..
☛ అవగాహన సదస్సు తేదీ : నవంబర్ 4, 2023(శనివారం)
☛ వేదిక : సెమినార్ హాల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ (అటానమస్) ఫర్ ఉమెన్.
☛ సమయం : ఉదయం 09:30 నుంచి 12:30 వరకు.
ముఖ్య సమాచారం :
విజయనగరంలో..
☛ అవగాహన సదస్సు తేదీ : నవంబర్ 5, 2023(ఆదివారం)
☛ వేదిక : హోటల్ ఆనంద్ గ్రాండ్ ఫోర్ట్, ఏజీ రోడ్, త్రీ ల్యాంప్స్ జంక్షన్ దగ్గర
☛ సమయం : ఉదయం 09:30 నుంచి 12:30 వరకు.