TSPSC&APPSC Groups: 'ఇండియన్ పాలిటీ'ని ఎలా ప్రిపేర‌వ్వాలి? ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతారు?

వర్తమాన రాజకీయాలను, సంఘటనలను రాజ్యాంగ పరంగా పరిశీలిస్తూ అధ్యయనం చేస్తే పాలిటీ విభాగంలో అడిగే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించొచ్చు.
Polity

గతంలో పాలిటీ నుంచి వచ్చే ప్రశ్నల్లో ఎక్కువ విషయ పరిజ్ఞానానికి సంబంధించినవి ఉండేవి. ప్రస్తుత పరీక్షల్లో మాత్రం ప్రశ్నల తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విశ్లేషణ సామర్థ్యం (analytical ability), తులనాత్మకత (comparision)కు ప్రాధాన్యమిస్తున్నారు.

TSPSC Groups Study Material : ఈ స్టడీ మెటీరియల్స్‌ శుద్ద దండగ.. ఈ పుస్తకాలు అయితే బెస్ట్‌..!

☛ అభ్యర్థుల జ్ఞాపకశక్తిని పరీక్షించడం కంటే.. వారి విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పొచ్చు. దీంతోపాటు ఇప్పటి వరకు జరిగిన ముఖ్య రాజకీయ సంఘటనలకు, వాటితో సంబంధమున్న ప్రముఖ రాజకీయ వ్యక్తులను అనుసంధానం చేస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. చారిత్రకంగా రాజకీయ విశ్లేషణ చేయగలిగితే అభ్యర్థులు ఈ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించగలరు.

☛ Indian Polity Study Material Click Here
☛ కొన్ని ప్రశ్నలు జాతీయోద్యమానికి (చరిత్ర) సంబంధించి.. మరికొన్ని ప్రశ్నలు ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటాయి. సమకాలీన అంశాల ప్రాతిపదికగా మరికొన్ని ప్రశ్నలు అడిగే అవకాశాలు ఎక్కువే.

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​  
  
ముఖ్యంగా అధ్యయనం చేయాల్సిన అంశాలు ఇవే..
➤ రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, ముఖ్య కమిటీలు; ప్రముఖ సభ్యులు - వారి కృషి తదితర అంశాలపై దృష్టిసారించాలి. రాష్ట్రపతి ఎన్నిక, తొలగింపు, అధికారాలు; మంత్రి మండలి; సంకీర్ణ వ్యవస్థలో బలహీనపడుతున్న ప్రధానమంత్రి వ్యవస్థ; పార్లమెంట్ నిర్మాణం; లోక్‌సభ విశేష అధికారాలు; రాజ్యసభ ప్రత్యేక అధికారాలు; పార్లమెంటు-శాసన, రాజ్యాంగ, విచారణ, విధులు; కార్యనిర్వాహక వర్గాన్ని జవాబుదారీతనం చేయడంలో దాని క్షీణత; విప్‌ల జారీ; పార్టీ ఫిరాయింపుల చట్టం; స్పీకర్ పాత్ర; నేరమయ రాజకీయాలు; న్యాయ వ్యవస్థ నిర్మాణం; సుప్రీంకోర్టు క్రియాశీలత అంశాలపై అవగాహన పొందాలి.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి
➤ ఎన్నికల సంఘం; కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్; ఆర్థిక సంఘం; యూనియన్; రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, వాటి విధులు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
రాష్ట్ర ప్రభుత్వం: గవర్నర్, మంత్రి మండలి, విధాన సభ, విధాన పరిషత్, హైకోర్టు; అధీన న్యాయస్థానాలు; ఈ విభాగం కింద ఆయా రాష్ట్రాల అవతరణ; అతి తక్కువ, అతి ఎక్కువ స్థానాలున్న అసెంబ్లీ; విధాన పరిషత్‌ల ఏర్పాటు-రద్దు; ఉభయ సభల అధికారాలు; గవర్నర్‌కున్న ప్రత్యేక అధికారాలు తదితరాలను అధ్యయనం చేయాలి.
కేంద్ర రాష్ట్ర సంబంధాలు: శాసన, పాలన, ఆర్థిక సంబంధాలు; అంతర్ రాష్ట్ర మండలి; సర్కారియా కమిషన్, ఫూంఛి కమిషన్- వాటి సిఫార్సులను అధ్యయనం చేయాలి.

Groups Guidance: మొదటిసారిగా గ్రూప్‌ 2 రాస్తున్నారా? అయితే ఇది మీ కోస‌మే..
ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు: ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాల ప్రాధాన్యత; ఆ రెండిటి మధ్య ఘర్షణ; వాటికి సంబంధించి రాజ్యాంగ సవరణలు; ప్రధానమైన కోర్టు తీర్పులపై అవగాహన ఏర్పరచుకోవాలి. 
స్థానిక స్వపరిపాలన: మేయో, రిప్పన్ తీర్మానాలు; బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, హనుమంతరావు కమిటీ, జి.వి.కె.రావు కమిటీ, సింఘ్వి కమిటీలు- వాటి సిఫార్సులు; 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు; ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం; మున్సిపాల్టీల చట్టం తదితర అంశాలు ముఖ్యమైనవి.

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?
ఇతర సంస్థలు: జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు; మహిళా కమిషన్; అల్ప సంఖ్యాక, వెనుకబడిన తరగతుల కమిషన్లు; షెడ్యూల్డ్ కులాలు, తెగల కమిషన్లు; ప్రణాళిక సంఘం; జాతీయాభివృద్ధి మండలి; ప్రాంతీయ మండళ్లు గురించి సమాచారంపై అవగాహన అవసరం.

☛ Indian Polity Bitbank Click Here

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!
రాజ్యాంగ సవరణలు: ముఖ్యమైన రాజ్యాంగ సవరణలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎన్నికల సంస్కరణలు; సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ); సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ); లోక్‌పాల్; లోకాయుక్త వంటి ఇతర అంశాలపై అవగాహన కూడా ఎంతో అవసరం.

​​​​​​​గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే..ఇవి త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

#Tags