TSPSC Group 4 Preliminary Key 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ప్రాథమిక ‘కీ‘ విడుదల.. అలాగే ఫ‌లితాలు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) గ్రూప్‌-4 ప్రాథమిక ‘కీ’ ని ఆగ‌స్టు 28వ తేదీ (సోమ‌వారం) విడుద‌ల చేసింది. ఈ ప్రాథమిక ‘కీ’పై ఏమైన అభ్యంత‌రాలు ఉంటే.. ఆగ‌స్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా తెలియ‌జేవ‌చ్చ‌ని TSPSC తెలిపింది.

ఈ గ్రూప్‌-4 పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్‌ షీట్ల డిజిటల్‌ కాపీలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఇవి సెప్టెంబర్‌ 27 వరకు అవి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే ఈ గ్రూప్‌-4 ఫ‌లితాల‌ను కూడా ఒక వారం రోజుల్లో ఎప్పుడైన విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

☛ TSPSC Group-3 Exam Dates 2023 : 1,375 గ్రూప్‌-3 ఉద్యోగాలు.. అక్టోబర్‌లో ప‌రీక్ష‌లు.. ఒక్కోక్క‌ పోస్టుకు ఎంత మంది పోటీప‌డుతున్నారంటే..

గ్రూప్‌-4 ప‌రీక్ష‌ను జూలై 1వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. మొత్తం 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్‌-1కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

☛ TSPSC Group 2 Exam Preparation Tips: గ్రూప్‌–2.. సక్సెస్‌ ప్లాన్‌

TSPSC గ్రూప్‌-4 కటాఫ్ ఎంత‌..?

గ్రూప్‌-4 ఉద్యోగాల సంఖ్య, ప‌రీక్ష‌కు హాజ‌రైన అభ్య‌ర్థులు సంఖ్య‌, ప‌రీక్ష పేప‌ర్ ఆధారంగా, Reservation Policy, Previous Year Cutoff Marks, ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల ఇచ్చిన‌ స‌ల‌హాలు-సూచ‌న‌లు, వివిధ స‌ర్వేల ఆధారంగా ఈ ఏడాది గ్రూప్‌-4 కటాఫ్‌ అంచనాను కింది ప‌ట్టిక‌లో ఇస్తున్నాము. ఈ కటాఫ్ మార్కులు కేవలం ఒక అంచనా మాత్ర‌మే. అంతిమంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ అధికారికంగా ఇచ్చిన కటాఫ్ మార్కులు ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో సుమారు 99 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. జిల్లా, జోనల్‌ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. జిల్లా, జోనల్‌ స్థాయిని బ‌ట్టి కూడా క‌టాప్ మార్కులు మారే అవ‌కాశం ఉంటుంది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

 TSPSC Group 4 Paper 1 & 2 Question Paper & Key ( Click Here)

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ప్రాథమిక ‘కీ’ ఇదే..

#Tags