TSPSC Group 4 Selection list: ప్రభుత్వ శాఖలకు గ్రూప్‌–4 అర్హుల తుది జాబితా.. ధ్రువపత్రాల పరిశీలన ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసింది. 8 వేలకు పైబడి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

తాజాగా ప్రభుత్వ శాఖల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆయా శాఖలకు పంపింది. ఈనేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అధికారులు చేపట్టారు.

పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో రోజుకు కొంత మంది చొప్పున అభ్యర్థులకు షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వ శాఖలు.. ఆమేరకు పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశాయి. మరో 3 రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానుందని అధికారులు చెబుతున్నారు.

చదవండి: Success Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..

ధ్రువపత్రాల పరిశీలనలో సందేహాలుంటే సంబంధిత జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇస్తున్నారు. ప్రధానంగా కుల ధ్రువీకరణ పత్రాలపై సందేహాలు వస్తుండడంతో వాటి నిర్ధారణ కోసం జిల్లా కలెక్టర్లకు సమాచారం అందిస్తున్నారు. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిర్ధారించాలని కోరుతున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అలాంటి వాటిని పెండింగ్‌లో పెడుతున్న అధికారులు.. మిగిలిన వాటి పరిశీలన పూర్తి చేస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.   
 

#Tags