TGPSC Group-3 Preliminary Key 2025 : గ్రూప్ 3 ప్రిలిమినరీ 'కీ' విడుదల.. ఈ ప్రశ్నలకు..
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గ్రూప్-3 పరీక్షలను 2024 నవంబర్ 17, 18వ తేదీల్లో నిర్వహించిన విషయం తెల్సిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ 'కీ' ని TSPSC https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఈ కీ పైన జనవరి 12 సాయంత్రం 5గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ గ్రూప్-3 కీ కోసం..
1,363 గ్రూప్-3 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,36,400 మందికి గాను 2,69,483 మంది హాజరు అయ్యారు.
టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్ ద్వారా కీ ని చెక్ చేసుకోవచ్చని కమిషన్ సభుడు నవీన్ నికోలస్ వెల్లడించారు. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలనూ ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలని సూచించారు.
#Tags