Again TSPSC Group 2 Exam PostPoned 2023 : మ‌రో 'సారి' గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా ప‌డే అవ‌కాశం..అలాగే డీఎస్సీ కూడా..ఎందుకంటే..?

సాక్షి ఎడ్య‌కేష‌న్ : ఈ సారి తెలంగాణ‌లలో ప్ర‌భుత్వ ఉద్యోగ ప‌రీక్ష‌లు జ‌రిగే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఒక‌వైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యం.. మ‌రో వైపు టీఎస్‌పీఎస్సీ నిర్వాకంతో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ముందుకు సాగ‌డం లేదు.
TSPSC Group 2 Exam 2023

ఈ స‌మ‌యంలో TSPSC గ్రూప్స్ 1 & 2 & 3 అభ్య‌ర్థుల‌తో పాటు.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌ల్లో కూడా ప‌రీక్ష‌ వాయిదా టెన్షన్ మొదలైంది. 

ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో.. వివిధ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా నవంబరు 2, 3 తేదీల్లో జరగాల్సిన గ్రూపు-2 పరీక్ష.. అలాగే.. నవంబర్‌ 25 నుంచి 30 వరకు జరగాల్సిన టీఆర్‌టీ-ఎస్‌జీటీ పరీక్షలు వాయిదా పడే అవకాశాలున్నాయి.

☛ TS Police Constable Certificate Verification Documents : పోలీస్‌ కానిస్టేబుళ్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ వివ‌రాలు ఇవే..

ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు అసాధ్యం.. ఎందుకంటే..?

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2కి 783 పోస్టులకు గాను దాదాపు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్‌-2 పరీక్ష (TSPSC Group 2 Exam) నిర్వహణకు 1600 కేంద్రాల్లో పోలీసులు దాదాపు 25 వేల మంది, పరీక్ష సిబ్బంది 20 వేల మంది అవసరం ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో పరీక్షకు సిబ్బంది సర్దుబాటు కష్టమని కలెక్టర్లు సూచించినట్లు తెలిసింది. రిటర్నింగ్‌, పరీక్ష చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారుల నియామకం సాధ్యంకాదని తెలిపినట్లు సమా చారం. రెండురోజుల పాటు వరుసగా నాలుగు సెషన్లలో పరీక్షల నిర్వహణకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలిసింది.అలాగే.. రవాణా ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది.

☛ TS Constable Cut off Marks 2023 : టీఎస్ కానిస్టేబుల్ కటాఫ్ మార్కులు ఇవే.. కొంపముంచిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..

ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణపై కొంత సందిగ్ధత ఏర్పడినట్లు సమాచారం. ఒకవేళ TSPSC Group 2 Examను వాయిదా వేస్తే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత డిసెంబరు మూడో వారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ మరోసారి సమావేశమై స్పష్టత ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

డీఎస్సీ పరీక్ష కూడా వాయిదా ప‌డే అవ‌కాశం..?

టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌-2023లో భాగమైన సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌జీటీ) పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీఆర్‌టీ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

☛ TS DSC 2023 Postponed : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు.. ఇక డీఎస్సీ వాయిదానే.. లేదంటే..?

ఇందులో స్కూల్‌ అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టులకు నవంబరు 20 నుంచి 24 వరకు, ఎస్‌జీటీ పరీక్షలు నవంబరు 25 నుంచి 30 వరకు నిర్వహించాలి. నవంబరు 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కనీసం ఎస్‌జీటీ పరీక్షలను వాయిదా వేయక తప్పదనే అభిప్రాయం వినబడుతోంది.

ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని.. అందువల్ల టీఆర్‌టీ నిర్వహణపై దృష్టి పెట్టడం సాధ్యంకాదని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. నవంబరు 20 నుంచి 24 వరకు జరిగే స్కూల్‌ అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టుల పరీక్షలకు ఇబ్బందిలేదనే విషయం కూడా వినబడుతోంది. మరి ప్రభుత్వం, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.

గ్రూప్-4 ఫలితాలు వాయిదా..?

దీంతో మొత్తం ఉపాధ్యాయ పరీక్షలు వాయిదా వేస్తారా? ఆ రోజు జరగాల్సినవి మాత్రమే వాయిదా వేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందు నుంచే అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై దృష్టిపెట్టాల్సి రావడంతో టీచర్ పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. 

ఇక గ్రూప్స్ విషయంలో కూడా ఇదే తరహా సందేహాలు వినిపిస్తున్నాయి. గ్రూపు-2 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కమిషన్‌ కొందరు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో పరీక్షకు సిబ్బంది సర్దుబాటు కష్టమని కలెక్టర్లు సూచించినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గ్రూప్-4 ఫలితాలు వెల్లడిస్తారా లేదా అన్న విషయంలో కూడా సందేహాలు నెలకొన్నాయి. ఇక గ్రూప్‌-3 ప‌రీక్షపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి క్లారిటీ లేదు. ఇక పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ‌ర్థులు.. ఇప్ప‌ట్లో ప‌రీక్ష జ‌రిగే అవ‌కాశం లేద‌ని ఆందోళ‌న‌లో ఉన్నారు. 

#Tags