TGPSC Group 2 : అత్యంత కఠినంగా గ్రూప్-2లో ప్రశ్నలు.. ఈసారి హాజరు శాతం కేవలం..
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నిన్న రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం జరిగాయి. మరో రెండు పేపర్లు నేడు అదే ఉదయం, మధ్యాహ్నం జరగనున్నాయి.
అయితే, నిన్న జరిగిన పరీక్షలో ప్రశ్నలు ఎంతో కఠనంగా వచ్చాయని, రాసేందుకు సమయం సరిపోలేదని వ్యక్తం చేశారు. చాలాకాలంగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు సైతం 150కి 70-90కిపైగా స్కోర్‌చేయలేని విధంగా ప్రశ్నలు ఇచ్చారు. నిన్న రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షల్లోనూ ఇదే జరిగిందని తెలిపారు అభ్యర్థులు.
పరీక్షలో అభ్యర్థుల హాజరు శాతం..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్న.. అంటే, డిసెంబర్ 15వ తేదీన ప్రారంభమైన గ్రూప్-2 పరీక్షకు 5,51,855 మంది దరఖాస్తులు చేసుకోగా, పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్షకు 46.75 శాతం అంటే, 2,57,981 మంది అభ్యర్థులు హాజరైయ్యారు. పేపర్-2 పాలిటీ, హిస్టరీ సోషియోకల్చర్ పరీక్షకు 46.30 శాతం అంటే, 2,55,490 మంది హాజరైయ్యారు.
అభ్యంతరాలు ఇలా..
1. పేపర్-2లో చరిత్రలో ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయి.
2. జతపరచడం, సరైనవి ఏవీ. సరికానివి ఏవీ అన్న ప్రశ్నలే అధికంగా ఇవ్వడంతో సమయం సరిపోలేదు.
3. తెలంగాణ చరిత్ర, దేశ చరిత్ర ప్రశ్నలు ఎక్కడినుంచి వచ్చాయో తెలియక అభ్యర్థులు టెన్షన్ పడ్డారు.
4. గ్రాంధీక భాషను వాడటంతో ఒకటికి రెండుసార్లు ప్రశ్నలు చదవాల్సి వచ్చింది. కొందరికి, ఈ ప్రశ్నలు సరిగ్గా అర్థం కాలేదు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
5. ఇంగ్లిష్‌లో ఇచ్చిన 20 ప్రశ్నలకు లోతైన పరిజ్ఞానం ఉంటే తప్ప ఆన్సర్ చేయలేని పరిస్థితి.
6. జనగామ జిల్లాలో సెయింట్‌మేరీస్, సెయింట్ మారి యా పాఠశాలలు పక్కపక్కనే ఉండగా, ఓ మహిళా అభ్యర్థి ఒక సెంటర్‌కు బదులు మరో సెంటర్‌కు వెళ్లింది. పొరపాటు జరిగిందని తెలుసుకుని పక్క సెంటర్‌కు వెళ్లే వరకు సమయం మించిపోవడంతో ఆ అభ్యర్థి పరీక్ష రాసే అవకాశం కోల్పోయింది.
7. సంగారెడ్డిలో 15 మంది, కరీంనగర్‌లో 14, సిద్దిపేటలో 12 మంది ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు.
8. సికింద్రాబాద్ పీజీ కాలేజీ వద్ద ఓ మహిళా అభ్యర్థి ఆలస్యంగా చేరుకుంది. అదే సమయంలో టీజీపీఎస్సీ చైర్మన్ బీ వెంకటేశం తనిఖీకి రాగా, ఆయన్ను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది.
TSPSC Group-2 Question Paper 1 With Key 2024 : గ్రూప్–2 పేపర్-1 కొశ్చన్ పేపర్ & కీ ఇదే.. ఈ సారి ప్రశ్నలకు సమాధానాలు ఇవే...
9. వికారాబాద్ జిల్లాలో శ్రీసాయి డెంటల్ కాలేజీ సెంటర్‌లో ఓ అభ్యర్థి ఫోల్డెడ్ సెల్‌ఫోన్‌తో పరీక్షకు హాజరయ్యాడు. మధ్యలో గుర్తించిన అధికారులు అభ్యర్థిని పోలీసులకు అప్పగించి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదుచేశారు.
10. లోతైన ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు దానిని అర్థం చేసుకునేందుకే సమయం మంచిపోతుంది.