APPSC Group 1 Ranker Success : ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే.. గ్రూప్‌-1 కొట్టానిలా..

ఎట్ట‌కేల‌కు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 (2018) ఫైన‌ల్ ఎంపిక జాబితాను విడుద‌ల చేసింది. 2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్‌ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.
తరిణి సన్యాసిరావు

ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1లో మంచి ర్యాంక్ సాధించి ఉద్యోగానికి ఎంపికైన తరిణి సన్యాసిరావు స‌క్సెస్ స్టోరీ మీకోసం..

APPSC Group 1 Ranker Success Story : ఈ ల‌క్ష్యం కోస‌మే చ‌దివా.. అనుకున్న‌ట్టే.. డిప్యూటీ కలెక్టర్ కొట్టానిలా..

కుటుంబ నేప‌థ్యం :
ఈయ‌న‌ది విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలం గొల్జాం స్వగ్రామం. తల్లిదండ్రులు తరిణి రామారావు, ఈశ్వరమ్మ. వీరి ప్రోత్సాహంతో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ పూర్తి చేశారు. ఈయ‌న గ్రూప్‌–1లో మంచి ర్యాంక్ సాధించ‌డంతో.. త‌ల్లిదండ్రులతో పాటు భార్య పద్మశ్రీ, కుమారై లిఖితరామ్, కుమారుడు భార్గవ్‌రామ్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

APPSC Group 1 Ranker Success Story : నా ఫోన్‌తోనే.. గ్రూప్‌-1 ర్యాంక్ కొట్టానిలా.. ఎలా అంటే..?

ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ..
విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని బంగారయ్యపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తరిణి సన్యాసిరావు 2006లో డీఎస్సీ క్వాలిఫై అయ్యారు. 2008 ఫిబ్రవరి 28న ఎస్‌.కోట మండలం వెంకటరమణపేట ఎంపీయూపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ 2009 వరకు పనిచేశారు. 2009 ఆగస్టు నుంచి 2017 జూలై వరకు ఎంపీయూపీఎస్‌ జాకేరులో పనిచేశారు. 2017 ఆగస్టు నుంచి నేటి వరకు ఎంపీపీఎస్‌ బంగారయ్యపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. నేడు గ్రూపు–1లో విజేతగా నిలిచారు. దీనితో అసిస్టెంట్‌ ట్రజరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు.

Inspirational Success Story: సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్‌-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయ‌న‌కే..

APPSC Group-1 Top Ranker Rani Sushmita: ఎలాంటి కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంక్ కొట్ట‌నిలా.. వీరి స‌హాయం లేకుంటే..

#Tags