TSPSC Group-1: ప్రతిరోజూ ఇలా చదివితే.. గ్రూప్–1 మీదే..!
18 విభాగాల్లో మొత్తం 503 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూల రద్దుతో రెండంచెల(ప్రిలిమ్స్, మెయిన్స్) విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్–1లో విజేతగా నిలవాలనే వారికోసం ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు కృష్ణ ప్రదీప్ సూచనలు.. సలహాలు మీకోసం..
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..
60 రోజుల ప్రిపరేషన్ ప్రణాళిక ఇలా..
గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను జూలై/ఆగస్టులో నిర్వహించనున్నారు కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ముమ్మరం చేయాలి. మే/జూన్‌లోగా అన్ని అంశాలను చదివేలా 60 రోజుల ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవాలి. తర్వాత సమయాన్ని రివిజన్‌కు కేటాయించాలి. ప్రిలిమినరీ పరీక్ష సిలబస్‌లో పేర్కొన్న అంశాల్లో ఒకేవిధమైన వాటిని కలిపి చదవాలి. ఉదాహరణకు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు సిలబస్‌లో పేర్కొన్న తెలంగాణ రాష్ట్ర విధానాలు; గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ; అంతర్జాతీయ సంబంధాలు, ఈవెంట్స్‌ను కూడా కలిపి చదవాలి. అలాగే సోషల్ ఎక్స్‌క్లూషన్ సబ్జెక్టులో మహిళలు లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు సంబంధించిన రాజ్యాంగ అంశాలూ ఉంటాయి కాబట్టి భారత రాజ్యాంగం, పాలిటీని దీంతో కలిపి చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, జాగ్రఫీ అంశాలను ఒక విభాగంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలను మరో విభాగంగా చదవాలి. అలాగే పర్యావరణం, విపత్తు నిర్వహణ, జాగ్రఫీని ఒక విభాగంగా, భారతదేశ చరిత్రను తెలంగాణ సంస్కృతి, చరిత్రతో మరో విభాగంగా కలిపి చదవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిని కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌కు అనుసంధానిస్తూ చదవాలి.
Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
ప్రతిరోజూ ఇలా చదివేలా జాగ్రత్త వహించాలి..
సిలబస్‌లో అత్యధిక స్కోరింగ్ ఏరియా–లాజికల్ రీజనింగ్. దీన్ని అశ్రద్ధ చేయకుండా ఏకాగ్రతతో చదవాలి. అభ్యర్థులు రోజూ 10 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించాలి. అన్ని విభాగాలను ప్రతిరోజూ చదివేలా జాగ్రత్త వహించాలి. ప్రతి విభాగానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించి, ప్రతి విభాగానికి మధ్యలో అవసరమైన విరామం తీసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి.
శాఖల వారీగా గ్రూప్-1 పోస్టుల వివరాలు.. వయోపరిమితి ఇలా .. :
పోస్టు | ఖాళీలు | వయో పరిమితి |
డిప్యూటీ కలెక్టర్ | 42 | 18–44 |
డీఎస్పీ | 91 | 21–31 |
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ | 48 | 18–44 |
రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ | 4 | 21–31 |
జిల్లా పంచాయతీ అధికారి | 5 | 18–44 |
జిల్లా రిజి్రస్టార్ | 5 | 18–44 |
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(మెన్) | 2 | 21–31 |
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ | 8 | 18–44 |
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ | 26 | 21–31 |
మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–2) | 41 | 18–44 |
అసిస్టెంట్ డైరెక్టర్ (సాంఘిక సంక్షేమం) | 3 | 18–44 |
డీబీసీడబ్ల్యూఓ (బీసీ సంక్షేమం) | 5 | 18–44 |
డీటీడబ్ల్యూఓ (గిరిజన సంక్షేమం) | 2 | 18–44 |
జిల్లా ఉపాధి కల్పనాధికారి | 2 | 18–44 |
పరిపాలనాధికారి(ఏఓ)(వైద్య, ఆరోగ్య శాఖ) | 20 | 18–44 |
అసిస్టెంట్ ట్రెజరర్(ట్రెజరీస్ అండ్ అకౌంట్స్) | 38 | 18–44 |
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(స్టేట్ ఆడిట్ సరీ్వస్) | 40 | 18–44 |
ఎంపీడీఓ(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) | 121 | 18–44 |
Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మొత్తం మార్కులు: 900
సబ్జెక్ట్ | సమయం (గంటలు) | గరిష్ట మార్కులు |
ప్రిలిమినరీ టెస్ట్ (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) | 2 1/2 | 150 |
రాత పరీక్ష (మెయిన్ ) (జనరల్ ఇంగ్లిష్)(అర్హత పరీక్ష) | 3 | 150 |
మెయిన్ పేపర్–1 జనరల్ ఎస్సే
|
3 | 150 |
పేపర్–2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ
|
3 | 150 |
పేపర్–3 ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
|
3 | 150 |
పేపర్–4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
3 | 150 |
పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
|
3 | 150 |
పేపర్–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం
|
3 | 150 |