Telangana Group-1 News: నేటి నుంచి తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలు నేటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం.12.30 నుంచి 1.30 గంటల వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఎగ్జామ్ రూమ్, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో CC కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండకుండా పోలీసులు BNSS 163 సెక్షన్ విధించారు.పరీక్షలకు సంబంధించి అనుమానాలపై 040-23452185, 040-23452186 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
ఇదీ చదవండి: నేడు సుప్రీంకోర్టులో గ్రూప్-1 పరీక్షలు వాయిదా పై విచారణ
ఇదీ చదవండి: గ్రూప్–1 మెయిన్స్.. అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మూఖ్యంగా హాల్‌టికెట్..
#Tags