TSPSC Group I: గ్రూపు–1 కోసం ప్రత్యేక బస్సులు నడపాలి
మెట్‌పల్లి: జూన్ 9న జరిగే గ్రూపు–1 పరీక్షను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ యూత్ విభాగం నాయకులు జూన్ 4న ఆర్టీసీ డిపో మేనేజర్ వేదవతికి వినతిపత్రం అందించారు.
మెట్‌పల్లి ప్రాంతంలో వందలాది మంది పరీక్షకు హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండడానికి అన్ని రూట్లలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి డీఎం సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రవీణ్, మోరెపు తేజ, గుండవేని ప్రణయ్, కొండ్లెపు శ్యాం, సలీం, అభిషేక్ తదితరులున్నారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
#Tags